YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సర్కార్ బడుల్లోనే పదవ తరగతి పరీక్షా కేంద్రాలు

సర్కార్ బడుల్లోనే పదవ తరగతి పరీక్షా కేంద్రాలు
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోనే 10వ తరగతి పరీక్షా కేంధ్రాలు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశఖాధికారిని కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం విద్యాశాఖ ప్రగతి తీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే 10వ తరగతి పరీక్షల నిర్వహణకు నూటికి నూరు శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు కావాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
కాపీ కొట్టి ఉతీర్ణత సాధించాలనే ఆలోచనకు స్వస్థి పలకాలన్నారు. ఇటువంటి ఆలోచనలు విద్యార్థుల్లో అనువంతైనా లేకుండా ఉపాద్యాయులు వారికి బోధన అందించాలన్నారు. తమ బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పిల్లలు కష్టపడి చదివి, పాఠ్యంశాలు అర్థం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించే సానుకూలత దృక్పధాన్ని విద్యార్థుల్లో  తీసుకురావాలన్నారు. ఇదే సమయంలో ఆయా పాఠశాలల్లో ఉత్తీర్ణత తాశాతాన్ని మెరుగైన రూపంలో చూపించేందుకు ఏ ఒక్కరూ కూడా పరీక్షల్లో కాపీలను ప్రోత్సహించేందుకు ఎంత మాత్రం ప్రయత్నం చేయవద్దన్నారు. పిల్లల ఫోటోఆధారిత హాజరు మేరకే మధ్యాహ్న భోజన పధకం బిల్లులు చెల్లింపులు జరగాలని కలెక్టర్ చెప్పారు. ఈ మేరకు ఈ అశాంన్ని పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో చేపట్టేందుకు సంబంధిత ఉన్నత అధికారులతో సంప్రదించాలని డిఇఓను కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలల్లో నమోదైన పిల్లల సంఖ్యకు, రోజూవారి హాజరుకు చాలా వ్యత్యాసం కనపబడుతుందన్నారు. ఈ దృష్ట్యా విద్యార్థుల వాస్తవ హాజరుగుర్తించేందుకు ఫోటో ఆధారిత హాజరును ప్రవేశపెట్టాలన్నారు. దీని ఆథారంగా మధ్యాహ్న భోజన పధకం నిర్వాహకులకు, పౌరసరఫరాల సంస్థ తదితర శాఖలకు బిల్లులు చెల్లింపు చేయాలన్నారు. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వాహణకు సంబంధించిన నేతనాలను సమయానికల్లా సంబంధిత కార్మికులకు అందేలా చొరవ తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన చెల్లింపులు సెర్ఫ్ సామాజిక, టెరిటోరియల్ అటవీ విభాగాల అధికారుల నుండి ఎప్పటికప్పుడు జరిగేలా జిల్లా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం భోజన పథకం అమలుకు 330 కిచెన్ కమ్ స్టోర్ రూమ్ లు నిర్మణం చేపట్టగా  వాటిలో ఐటిడిఎ పరిధిలో రెండు మాత్రం పూర్తి కావాల్సి ఉందని వాటిని రానున్న 72 గంటల్లో పూర్తి చేయాలని ఐటిడిఎ పిఓను కలెక్టర్ ఆదేశంచారు. జిల్లాలో మద్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేస్తున్న 3,188 పాఠశాలల్లో ఖచ్చితంగా ఎల్పీజి గ్యాస్ కనెక్షన్ ద్వారానే వంట చేయించాలన్నారు. జిల్లాలో 33 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మద్యహ్న భోజన పథకం అమలుకు రావాల్సిన నిధులను  సంబంధిత కమిషనరేట్ నుంచి రప్పిచే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల్లో సామాజిక, సాంస్కృతిక చైతన్యం  కల్పించేందుకు ప్రతీ విద్యాసంస్థల్లో నాలుగు సార్లు ఆయా రంగాల్లో పోటీలు నిర్వహించాలన్నారు. పాఠశాల, మండల స్థాయిల్లో ఖచ్చితంగా ఈ పోటీలు నిర్వహించి, సర్టిఫికెట్లు బహుకరించాలన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్లను డిసెంబర్ 1 నుండి పూర్తి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. జిల్లాలో బడి బయట ఉన్న 11,132 మంది పిల్లలను గుర్తించారని, వారందరికి అవసరమైన విద్యాబోధన క్రమంతప్పకుండా అందాలన్నారు. ఈ సమావేశం లో జిల్లా విద్యాశాఖాధికారిణి సి.వి.రేణుక, సర్వశక్షఅభియాన్ పిఓ బ్రహ్మానందరెడ్డి, డి,ఎఫ్,ఓ ఎమ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Related Posts