YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రతిష్టాత్మకంగా జర్నలిస్టుల గృహనిర్మాణాలు

ప్రతిష్టాత్మకంగా జర్నలిస్టుల గృహనిర్మాణాలు
రాష్ట్రంలో గుర్తింపు పొందిన జర్నలిస్టులకు గృహ వసతి కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చందద్రబాబునాయుడు 100 కోట్ల రూపాయలు కేటాయించారని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కాల్వ శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం ఉదయం అనంతపురం నుండి సమాచార శాఖ అధికారులు, గృహనిర్మాణ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ లో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రంలోని గుర్తింపు పొందిన జర్నలిస్టులకు గృహ సౌకర్యం కల్పిస్తానని చేసిన వాగ్దానం మేరకు ఎంతో ప్రతిఫ్టాత్మకంగా అమలు చేయనున్నట్లు చెప్పారు. దేశం లో మొట్టమొదటిసారిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులకు సొంత ఇంటి గృహ సౌకర్యం కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. వచ్చే డిసెంబర్ రెండో వారంలో  ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంఖుస్థాపన కార్యక్రమం చర్యలు చేపట్టామని మంత్రి కాల్వ శ్రీనివాస్ తెలిపారు. అధికారులు అర్హతలున్న జర్నలిస్టుల నుండి ఆన్ లైన్ ద్వారా, ఫిజికల్ గా నేరుగా వారి వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించాలని చెప్పారు. వచ్చే జనవరి,ఫిబ్రవరి నెలల్లో గృహ నిర్మాణాలు ఊపు అందుకొంటాయని, ఈ లోగా గుర్తింపు పొందిన జర్నలిస్టులకు సమాచారశాఖ అధికారులు, గృహనిర్మాణ అధికారులు సమాచారం అందించి దరఖాస్తులు స్వీకరించి అందుబాటులో ఉంచుకోవాలన్ననారు. జిల్లా కేంద్రం ముఖ్య పట్టణాల్లో 2బెడ్, 3బెడ్ రూములు గృహ సముదాయం నియమిస్తామని, కొంతమంది జర్నలిస్టులు ఒక గ్రూపుగా ఏర్పడి కోరుకుంటే వారికి ఒకే చోట ఒక బ్లాక్ గా గృహనిర్మాణం చేపడతామన్నారు. సాధ్యమైనంత త్వరగా గృహనిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. మానవ సంబంధాలు, మీడియా సంబంధాలు మరింతగా పెంపొందించుకునేందుకు వీలుగా సమాచారశాఖ అధికారులు విధినిర్వహణలో భాగంగా జర్నలిస్టులకు గృహ సౌకర్యం కల్పించడంలో తమ వంతు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు గృహనిర్మాణశఖాధికారులు వ్యక్తం చేసిన సమస్యలను మంత్రి కాల్వ శ్రీనివాస్, కమిషనర్ వెంకటేశ్వర్లు నివృత్తి చేసారు. ఈ విడియోకాన్ఫరెన్స్ లో ఏలూరు నుండి పాల్గొన్న సమాచారశాఖ సహయసంచాలకులు కె. సుభాషిణి మాట్టాడుతూ పశ్చిమగోదావరి జిల్లాలో 1085 మందికి అక్రిటేషన్లు మంజూరు చేసామని ఇంతవరకూ గృహనిర్మాణం కోసం 90 దరఖాస్తులు అందాయని చెప్పారు. కార్యాలయం లో దరఖాస్తులు స్వీకరించేందుకు సహయ పౌరసంబందాధికారి సి.హెచ్.కె.ప్రసాద్ లింగం ను నోడల్ అధికారిగా నియయమించామని చెప్పారు. ప్రభుత్వం జర్నలిస్టులకు పెద్ద ఎత్తున గృహసౌకర్యం కల్పిస్తున్న దృష్ట్యా జిల్లాలోని అర్హతగల జర్నలిస్టులు ఈ సదవకాశాలను వినియోగించుకొని త్వరితగతిన దరఖాస్తులు అందజేయాలని కె.సుభాషిణి చెప్పారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో ఏలూరు నుండి గృహనిర్మాణశాఖ పిడి శ్రీనివాసరావు, సమాచారశాఖ సహయ పౌర సంబందాధికారులు దుర్గాప్రసాద్, ఐ.సాయిబాబ పాల్గొన్నారు.

Related Posts