YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాలేజీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి సోమిరెడ్డి

కాలేజీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి సోమిరెడ్డి
గత ఏడాది జూన్ లో నా చేతుల మీదుగానే శంకుస్థాపన చేసి ఈ రోజు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది. ప్రహరీ, సిమెంట్ రోడ్ల నిర్మాణంతో పాటు మైదానం లెవలింగ్ కూడా చేయిస్తామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు అయన మనుబోలులో రూ.1.85 కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలను వమ్ముచేయకుండా బాగా చదివి ఉజ్వల భవిష్యత్తు పొందాలి. విద్యారంగంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో ప్రతి పదిహేను రోజులకు ఓ సారి సమీక్ష నిర్వహిస్తుంటారు. కాంట్రాక్టు అధ్యాపకులకు మినిమం టైం స్కేలు వర్తింపచేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫాం హౌస్ నుంచి పదిహేను రోజులకు ఓ సారి బయటకు వచ్చి, రెండు నెలలకు ఓ సారి కేబినెట్ మీటింగ్ పెట్టే సీఎంలా కాకుండా కష్టపడి పనిచేసే సీఎం మనకు ఉన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా పట్టుదలతో పనిచేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నారు. సీఎం చంద్రబాబు ధర్మపోరాటం సభ నిర్వహించిన తెల్లారి నుంచే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటం ఆనందంగా ఉందని అయన అన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ప్రకటించిన 3.21 లక్షల ఎకరాలకు కూడా నీరు అందించగలమా అని ఆందోళనకు గురయ్యాం. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఊరట కలిగించాయని అయన అన్నారు. రూ.15 వేల సబ్సిడీతో అందించే మోటార్లు 5 వేలు జిల్లాకు మంజూరు చేశాం. ఆయిల్ ఇంజన్లను 50 శాతం సబ్సిడీపై అందజేస్తున్నాం. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా సబ్సిడీపై అందిస్తున్న పరికరాలను రైతులు పొంది సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 

Related Posts