YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్ఎస్పీ రిసోర్స్ సెంటర్ ప్రారంభించిన స్పీకర్ కోడెల

ఎన్ఎస్పీ రిసోర్స్ సెంటర్ ప్రారంభించిన స్పీకర్ కోడెల
నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో రిసోర్స్ సెంటర్ 65లక్షలతో ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు సహకరించాలి వారాబంధీ ద్వారా అందరికీ నీరు ఇవ్వడం జరిగింది. రైతులు పంటలకు సరిపడా నీటిని పెడితే పంటలు బాగా పడుతాయని స్పీకర్ కోడెల శివస్రసాద రావు అన్నారు. శనివరం అయన  నరసరావుపేటలో ఎన్ఎస్పీ  ఆధ్వర్యంలో రూ 65లక్షలతో నిర్మించిన రిసోర్స్ సెంటర్ ను ప్రారంభించారు. కోడెల మాట్లాడుతూ అధికంగా నీరు పెట్టడం వలన తెగుళ్లు ఎక్కువగా వస్తాయి. సాగర్ నీటితో పాటు వర్షాలు పడినప్పుడు మాత్రమే నీళ్లు సరిపోతాయి. అందుకే ఇరిగేషన్ బోర్డు ఆధ్వర్యంలో వారాబంధీ ద్వారా నీళ్లు ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. వారాబంధీ ద్వారా దాదాపు చిట్టచివరి రైతులకు సైతం నీటిని అందించడం జరుగుతుంది. రిటైర్డ్ లస్కర్లు సైతం ఉపయోగించుకోవడం జరుగుతుంది. 26న సీఎం చంద్రబాబు  నకరీకల్లులో 6020కోట్లతో గోదావరి-పెన్నా అనుసంధానం ప్రాజెక్టు కు శంకుస్థాపన చేస్తున్నారు. ఇది పూర్తయితే సాగర్ కుడికాలువ రైతాంగానికి మహర్థశ వస్తుందని అన్నారు. వర్షం, కృష్ణా, గోదావరి నీళ్లు కలిపి కుడికాలువ ఆయకట్టు రైతులకు మహర్థశ రాబోతుంది. రిలయన్స్ పౌండేషన్ ఆధ్వర్యంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా రైతులకు వ్యవసాయంలో సలహలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. 1800 419 8800 కాల్ సెంటర్ నెంబర్ కు ఫోన్ చేయడం ద్వారా రైతులు వ్యవసాయంలో సలహలు సూచనలు తీసుకోవచ్చని అన్నారు.

Related Posts