YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అభద్రతా భావంతోనే చంద్రబాబు కుట్రలు

అభద్రతా భావంతోనే చంద్రబాబు కుట్రలు
 రాహుల్ గాంధీ పంచన చేరిన చంద్రబాబు వ్యాఖ్యలు వింతగా ఉన్నాయి.  బంగారు తెలంగాణ ఇస్తామని నాడు  కేసిఆర్ మోసం చేసారు. ఇప్పుడు చంద్రబాబు రాహుల్ తో కలిసి బంగారు తెలంగాణ చేస్తామంటూ చిలక పలుకులు పలుకుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. గురువారం అయన మీడియతో మాట్లాడారు. నవ్యాంధ్ర ను స్కాంధ్రగా మార్చిన ఘనుడు చంద్రబాబు. అక్రమార్కుల పై ఐటి దాడులు చేస్తే.. వారికి మద్దతుగా మాట్లాడటం సిగ్గుచేటు. సిఎం హోదాలో ఉన్న చంద్రబాబు అవినీతి తమ జన్మహక్కు లాగా మాట్లాడుతున్నారు. మీ ఎంపి కంపెనీల ద్వారా రుణాలు తీసుకుని మోసం చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చట్టబద్దంగా అధికారులు దాడులు చేస్తుంటే రాజకీయం చేయడం తగదు. లక్షల కోట్లు ప్రజా ధనాన్ని దోచుకుంటే అధికారులు చూస్తూ కూర్చోవాలా. ఆలీబాబా నలభై దొంగలు తరహాలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందే తప్ప, దేశం ఎక్కడా క్లిష్ట పరిస్థితులలో లేదని అన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా యన్టీఆర్ పెట్టిన టిడిపి ని నేడు చంద్రబాబు అదే పార్టీ కి దాసోహం చేశారు. అక్రమ సంపాదనను ఎలా దాచుకోవాలో నేర్చుకునేందుకే  చంద్రబాబు రాహుల్ పంచన చేరారు. కాంగ్రెస్ ను బట్టలు ఊడదీసి కొట్టండి అన్న టిడిపి నేతలు ఇప్పుడు ఎలా కలుస్తున్నారు. టిడిపి ఎంపి సుజనా చౌదరి 5,700కోట్లు మోసంచేసి ఆంధ్రా మాల్యాగా పేరు గడించారని అన్నారు. విజయ మాల్యా దేశం విడిచి పోయారు, అదే స్పూర్తితో ఆంద్రా మాల్యా కూడా వెళ్లిపోతారు. చెసిన తప్పును కూడా గొప్పగా చెప్పుకుని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న అంశం కాబట్టి.. సుజనా చౌదరి పై చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా  కమిటీ కి లేఖ రాశాను. కమిటీ ముందు ముద్దాయిగా ఉండాలే తప్ప, సభ్యునిగా కొనసాగకూడదు. ఆంధ్రాకు చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే.. సుజనాను వెంటనే పదవి నుంచి తొలగించాలని అన్నారు. సిఎం రమేష్ వందల కోట్లు ఎగ్గొట్టారు.. ఆయన పై కూడా చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు జాతీయ స్థాయిలో ఎవరిని కలుస్తున్నా... ఆయనతో పాటు సుజనా చౌదరి, సిఎం రమేష్ లే ఉంటున్నారు. ఇటువంటి అక్రమార్కులను పక్కన తిప్పుకుంటే.. చంద్రబాబు కు కూడా వాటా ఉందని భావించాల్సి వస్తుందన్నారు. తెలుగు దేశం  నేతల అక్రమాలను బయట పడితే ఆ దర్యాప్తు సంస్థలు లను రాష్ట్రం లోకి రానీయకుండా దగుల్బాజీ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణా లో మహాకూటమి ఓటమి ఖాయం, ఆతర్వాత ఎపిలో టిడిపి అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం. టిఆర్ఎస్ తో కలిసి పని చేసేందుకు చంద్రబాబు అరువులు చాచారు, సీట్ల దగ్గర తేడా వచ్చి, కలవలేకపోయారని అన్నారు. ముందు ముందు మహాకూటమి లో టిఆర్ఎస్ భాగస్వామిగా చేరుతుంది. కాంగ్రెస్, టిడిపి, టిఆర్ఎస్ లు అవినీతి లో కూరుకుపోయిన పార్టీ లే.. ఆమూడు పార్టిలు  కలుస్తాయి. విజయమాల్యాను దేశం దాటించాల్సిన అవసరం బిజెపికి లేదు.. ఆయనతో చంద్రబాబు కే సంబంధాలు ఉన్నాయి.  అభద్రతా భావం వల్లే చంద్రబాబు ఫోన్ టాపింగ్ లకు సంబంధించి జివో ఇచ్చారని అన్నారు.  ఆయన అభద్రతా భావంతోనే విపక్షాల పై కుట్రలు చేస్తున్నారు. గతంలో రహస్యంగా చేసేవారు,, ఇప్పుడు అధికారంతో టాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. 

Related Posts