YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అతి పెద్ద సోలార్ పార్క్ కు అంతా సిద్ధం

అతి పెద్ద సోలార్ పార్క్ కు అంతా సిద్ధం
ప్రపంచంలో అతి పెద్ద సోలార్ పార్కగా కర్నూలు అవతరించబోతోంది. పార్క సామర్ధ్యం మేర వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు పూర్తి కాబోతుంది. ఇప్పటికే 90% వరకు సౌర విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్ల పూర్తయ్యాయి. తమిళనాడులోని రామనాధపురంలో అదానీ సంస్థ నిర్మించిన సోలార్ పార్కే(648 మెగావాట్లు) ఇప్పటి వరకూ ప్రపంచంలో అతి పెద్దదిగా భావిస్తున్నారు. కర్నూలు పార్క సామర్ధ్యం వెయ్యి మెగావాట్లు కావడంతో దాని కంటే పెద్దది కాబోతోంది. కర్నూల్ సోలార్ పార్కులో సన్ ఎడిసన్ అనే సంస్థ 2015 నవంబరులో 500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి టెండరును దక్కించుకుంది.యూనిట్ విధ్యత్ కు రూ.4.64 ధరను ఆ సంస్థ కోట్ చేసింది. దేశంలోనే ఇప్పటి వరకు అదే తక్కువ ధర. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సన్ ఎడిసన్ సౌర విద్యుత్ యూనిట్ల నిర్మాణం చేపట్టలేకపోయింది. ఈ నేపథ్యంలోనే సన్ ఎడిసన్ నుంచి ఈ బాధ్యతను గ్రీన్ కో అనే సంస్థ తీసుకుంది. సౌర విద్యుత్ యూనిట్ల పనులను ముమ్మరం చేసిన గ్రీన్ కో ఏప్రిల్ నాటికి 500 మెగావాట్ల స్థాపక సామర్థ్యాన్ని నెలకొల్పబోతోంది. 2015 డిసెంబరులో అదే ధర(యూనిట్ రూ. 4.64 పైసలు)కు సాఫ్ట్ బ్యాంకు కర్నూలు సౌర పార్కులోనే 350 మెగావాట్ల సౌర విద్యుత్ టెండరును చేజిక్కించుకుంది. టెండరు దక్ష్కించుకున్న దగ్గర నుంచీ దాన్ని ఎంత తొందరగా పూర్తి చేయాలన్న తపనతోనే సాఫ్ట్ బ్యాంకు పని చేస్తూ వస్తోంది.అయితే కర్నూల్ ప్లాంట్ లో జరుగుతున్నా పనుల పై సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ, MarceloClaure, తన ట్విట్టర్ లో అప్డేట్ ఇచ్చారు.. కర్నూలులో 1000, అనంతపురం జిల్లాలో 1000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కోసం ప్లాంట్ల నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జల, బొగ్గు, గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కంటే సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి సులభం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి. అంతేకాక బీడు భూములు అధికంగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాలలో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు పలు కంపెనీలకు అవకాశం కల్పించింది. ఏపీ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఈ పనులను పర్యవేక్షిస్తోంది.

Related Posts