YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో ఐదు జిల్లాలకు ఎ కేటగిరి

ఏపీలో ఐదు జిల్లాలకు ఎ కేటగిరి
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాలనలో భాగంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పలు శాఖల పనితీరును అనుసరించి వాటికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ర్యాంకులు కేటాయించారు. జిల్లాల వారీగా రెండు విభాగాలుగాను, శాఖల వారీగా నాలుగు కేటగిరీలుగాను విభజించి ర్యాంకులు ప్రకటించారు. 150.2 శాతం ఫలితాలతో జల వనరుల శాఖ అగ్రస్థానంలో నిలిచింది.జిల్లాల్లో  'ఏ' కేటగిరీలో ఉభయ గోదావరి జిల్లాలతోపాటు, కృష్ణ, చిత్తూరు, కడప జిల్లాలు నిలవగా, మిగిలిన జిల్లాలు 'బి' కేటగిరీలోకి వచ్చాయి. అలాగే, శాఖల వారీగా తీసుకుంటే 'ఏ' కేటగిరీలోకి జలవనరుల శాఖ, వ్యవసాయం, సహకారశాఖ, ఉద్యానం ...పట్టు పురుగుల శాఖ, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, పర్యావరణం, అటవీ శాఖ, వెనుకబడిన వర్గాల సంక్షేమం, కార్మిక, ఉపాధి కల్పన శాఖ, మహిళ, శిశు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల శాఖ, పశు సంవర్ధక, మత్స్య, ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమ శాఖలు నిలిచాయి. ఇక 'బీ' కేటగిరీలోకి పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, విద్య, గృహ నిర్మాణం, ఇంధన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి, మైనారిటీల సంక్షేమ శాఖలు, 'సీ' కేటగిరీలోకి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు, 'డీ' కేటగిరీలోకి క్రీడలు, యువజన వ్యవహారాల శాఖలు వచ్చాయి. దేశం బాగుంటే ఆంధ్రప్రదేశ్ కూడా బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేవలం ఏపీకే పరిమితం కాకుండా దేశం కోసం పనిచేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. డీఎల్ఎఫ్, రహేజా, ఎల్ అండ్ టీ, మైండ్ ట్రీ వంటి సంస్థలను ఆహ్వానించి హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని తెలిపారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు.ఇప్పటి దుబాయ్ పాలకుడు, అప్పటి యువరాజు సైతం సైబరాబాద్ ప్రాంతంలో పెట్టుబడి పెట్టారని తెలిపారు. గచ్చిబౌలిలో జాతీయ క్రీడల నిర్వహణను సవాలుగా తీసుకుని మౌలిక వసతులను అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ ను కట్టలేదని చెప్పడంపై స్పందిస్తూ..‘నేను హైదరాబాద్ ను కట్టలేదు. దాన్ని కులీకుతుబ్ షానే కట్టారని కేసీఆర్ చెప్పా. సైబరాబాద్ తో పాటు నగరంలో నేను చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించా. కేసీఆర్ గత నాలుగున్నరేళ్లలో ఒక్క ఫాంహౌస్ ను తప్ప ఇక దేన్నీ కట్టలేదు’ అని విమర్శించారు. ఓ పనిని ప్రారంభించడం ఎంత ముఖ్యమో, పూర్తిచేయడం కూడా అంతే ముఖ్యమని వ్యాఖ్యానించారు.ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆర్టీజీఎస్ సాంకేతికతను వాడుతున్నామని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచానికి ఓ నమూనాగా చూపుతామన్నారు. వయా డక్ట్ అనే కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని చంద్రబాబు అన్నారు. ప్రతి విభాగం ఓ విజన్ తో పనిచేయడమే దీని లక్ష్యమన్నారు. విజన్ -2020 డాక్యుమెంట్ ను తయారుచేయడానికి దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తన వద్దకు వచ్చారని గుర్తుచేసుకున్నారు. తాను ప్రకటించిన విజన్-2020పై పలు అంశాలను కలాం అడిగి తెలుసుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.ః

Related Posts