YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లోటు బడ్జెట్ వున్నా సంక్షేమ పథకాలు అమలు

లోటు బడ్జెట్ వున్నా సంక్షేమ పథకాలు అమలు
రాష్ట్ర విభజన  అనంతరం 16 వేల కోట్ల బడ్జెట్ లోటు ఉన్నప్పటికి ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా అన్ని సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను సిఎం చంద్రబాబునాయుడు  అమలు చేస్తున్నారని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి  నారా లోకేష్ చెప్పారు. బుధవారం నాడు భీమవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ  రైతు రుణ మాఫీ,డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద 10 వేల రూపాయలు అందించడం, 1000 రూపాయలు పెన్షన్ అందజేత,24 గంటలు విద్యుత్ సరఫరా, నిరుద్యోగ భృతి అందించడం వంటి కార్యక్రమాలను అమలు చేయడం సీయం చంద్రబాబునాయుడు ప్రతిభే కారణమని అన్నారు. 68 సంవత్సరాల వయస్సులో కూడా 24 సంవత్సరాల యువకుడిగా ఎంతో చురుగ్గా అహర్నిసలు రాష్ట్ర అభివృద్ధికి, మన పిల్లల భవిష్యత్తుకోసం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారన్నారు. 
గడిచిన నాలుగు సంవత్సరాలలో పశ్చమగోదావరి జిల్లాలో పంచాయితీల అభివృద్ధికి రూ 3,332 కోట్లు ఖర్చుపెట్టడం జరిగిందని ఒక భీమవరం నియోజక వర్గం లోనే రూ.150 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ప్రతీ పేదవారింటికి మంచి నీటి కుళాయిలు వేసేందుకు పశ్చిమగోదావరి జిల్లాకు రూ.1,100 కోట్లు కేటాయించామని, ఇందుకు సంబంధించిన పనులు టెండర్లు ప్రక్రియ పూర్తయిందన్నారు. త్వరలో ఈ పనులు ప్రారంభించి 2 సంవత్సరాల్లో ప్రతీ పేద కుటుంబానికి మంచి నీటా కుళాయి అందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుందన్నారు. భూగర్భ డ్రైయినేజీ నిర్మాణాలకు అత్యధిక ప్రధాన్యతనిస్తున్నామని, గ్రామాల్లో భూగర్భ డ్రైయినేజీ నిర్మాణాల కోసం కృషి చేస్తున్నామని, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు శాశ్వత పరిష్కారానికి డ్రైయినేజీలు తప్పనిసరిగా నిర్మించుకోవాలన్నారు రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధికి చంద్రన్న ప్రగతి బాటలు వేస్తున్నారన్నారు. ఆక్వా రంగానికి చేయూతనిచ్చేందుకు ఆక్వా ప్రోసెస్ సింగ్ యునిట్లకు అందించే విద్యుత్ సరఫరాకు యూనిట్ రూ.3.26 నుండి రూ. 2 తగ్గించామన్నారు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 29 సార్లు ఢిల్లీ వెళ్ళారని,  అయినప్పటికీ  బీజెపి ప్రభుత్వం  స్పందించలేదన్నారు.ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టం లో 18 హామీలు పాలకులు ఇవ్వడం జరిగిందని అయితే వాటి అమలు  విషయంలోప్రధాని నరేంద్రమోదీ  విస్మరించారన్నారు. ఈ విషయం పైనే ఎన్ డిఎ ప్రభుత్వం నుండి తెలుగుదేశం బయటకి వచ్చిందన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజెపీని దేశం నుండి ప్రాలద్రోలేందుకు అన్ని ప్రాతీయ పార్టీ నాయకులను కూడకడుతున్నామన్నారు. భీమవరం నియోజకవర్గంలో మూడు  మండలాలకు చెందిన ఆర్ అండ్ బి రోడ్ల సమస్యను ఆ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా వెపగ్రామంలో కలిదిండి చిన బంగారు రాజు సతీమణి లావణ్య నిర్మించిన గ్రామ పంచాయితీ కార్యాలయం కార్పొరేషన్ స్థాయిలో ఉందని  అభినందించారు. రాష్ట్రంలోనే అతి శుభ్రమైన గ్రామంగా వెంప గ్రామాన్ని తీర్చిదిద్ది వారందరిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ, కొల్లు రవీంధ్ర, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జెడ్ పి ఛైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, ఎమ్మోల్యే పులవర్తి రామాంజనేయులు, సాగిరాజు, సత్యనారాయణ రాజు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పాలి ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.    

Related Posts