YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సిటీలో పోలింగ్ కు అడగడుగునా నిఘా

 సిటీలో పోలింగ్ కు అడగడుగునా నిఘా

మేము రెడీ… మీరు సిద్ధమేనా…సిటీ మొత్తం మా ఆధీనంలోనే ఉంది..నిఘా కళ్లు అక్రమార్కులను వెంటాడుతోంది.. నిర్భయంగా వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోండి.. వదంతులు నమ్మొద్దు… ఎట్టి పరిస్థితుల్లో ప్రలోభాలకు గురి కావద్దు.. నచ్చిన వారికి ఓటు వేయండీ..ఎవరైనా బెదిరిస్తే మాకు చెప్పండీ… గడగడపకి మా బందోబస్తు ఉందంటూ సీటీ పోలీస్ కమిషనర్లు భరోసా ఇచ్చారు. మూడు కమిషనరేట్లలో ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.. ఎంత మంది బందోబస్తుకి కేటాయించారో.. తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్.. ఈ పేరు ఫేమస్.. పండగైనా..పబ్బమైనా.. చివరకు ఎన్నికలైనా…ఇక్కడ ఉండే హడావిడి అంతా ఇంతా కాదు.. ఏది చూడాలన్నా..వినాలన్నా సిటీకే ఆ స్థానం ఉంటుంది. అందుకే బెట్టింగ్ రాయుళ్లు కూడా సిటీలో సీట్ల గురించే జోరుగా పందెం కాస్తారు.. ఇక ఈ ఎన్నికల్లో ప్రచార హడావిడి పూర్తైంది. ఇక మిగిలింది పోలింగ్ మాత్రమే. మూడు కమిషనరేట్ల పరిధిలోకి వచ్చే సిటీలో ఈ సారి బందోబస్తుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. గత ఎన్నికల్లో మ్యాన్ పవర్ ఉంటే… ఈ సారి మ్యాన్ తో పాటు సిసి కెమేరాలు సైతం డ్యూటీ చేస్తున్నాయి. ఒక్క సిసి కెమేరా వంద మంది పోలీసులతో సమానం. కమిషనరేట్లలో ప్రతి పోలీస్ స్టేషన్ లో సిసి కెమేరాలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.7వ తేదీన జరిగే పోలింగ్ లో మూడు కమిషనరేట్లు కలిపి 45వేల మంది పోలీసులు 30వేల సిసి కెమేరాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ లో 15నియోజకవర్గాలకు గాను 3911 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇందుకోసం 17 వేల 845 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక పికెటింగ్ తో పాటు, అదనంగా సిసి కెమేరాలు ఏర్పాటు చేశారు. ఇక పాతబస్తీ ఈ పేరు అంటేనే హడల్.. ఇక్కడ చిన్నపాటి ఘటన కూడా చోటు చేసుకోకుండా పారామిలటీరీ ఫోర్స్ ను అధిక సంఖ్యలో దించారు.సైబరాబాద్ కమిషనరేట్ 2788 పోలింగ్ కేంద్రాలకు గాను ఈ సారి 14వేల 500 పోలీసులు బందోబస్తులో ఉంటారు. సైబరాబాద్ తో పాటు, వికారాబాద్, సంగారెడ్డి కలుపుకొని పని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రధాన విషయం ఐటీ కారిడార్.. ఈ భద్రతే ప్రధాన సమస్య.. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికనే రూపొందించారు. ఇక్కడి ఉద్యోగస్తులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఇక మిగిలింది రాచకొండ కమిషనరేట్.. పేరుకు చిన్నదే అయినా.. సమస్యలు మాత్రం బోలెడు.. మూడువేల 73 పోలింగ్ కేంద్రాలకు గాను ఈ కమిషనరేట్ లో కూడా 12వేల మంది పోలీసులు పనిచేయబోతున్నారు. శివారు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలీస్ పికెటింగ్ లు, వరంగల్, విజయవాడ, కర్నూల్ హైవేలపై చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. నాయకులు, పోలింగ్ కేంద్రాల వద్ద షాడో టీం లను ఏర్పాటు చేశారు.ఇక నిబంధనల విషయానికి వస్తే పోలింగ్ కేంద్రాల వద్ద వంద మీటర్ల వరకు నిషేదాజ్ఞాలు అమలు లో ఉంటాయి. ఓటర్లు కానీ నేతలు కానీ, అభ్యర్థులు కానీ ఏవరైనా సరే సెల్ ఫోన్లు, బ్యాగులు, కవర్లు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. పోలింగ్ కేంద్రాల్లోకి పోటీ చేసే అభ్యర్థి తప్ప ఆయన వెంట వచ్చే గన్ మెన్ కూడా వంద మీటర్ల దూరంలోనే ఆగిపోవాలి.. కేంద్రాల్లో ప్రచారాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. బందోబస్తులో ఉన్న పోలీసులు కూడా పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదు. అక్కడ డ్యూటీ చేసి ఎన్నికల అధికారి పిలిస్తే తప్ప లేపలికి వెళ్లకూడదు. పోలింగ్ కేంద్రాల వద్ద గానీ, ప్రధాన చౌరస్తాల్లో కానీ గుంపులు గుంపులుగా తిరగడం నిషేధం. వాహనాలు కూడా కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఉంచాలి. ఎన్నికల అధికారికి తప్ప, డ్యూటీ చేసే సిబ్బందికి కూడా సెల్ ఫోన్లు అనుమతించబడవు. ఇక గడిచిన రోజుల్లో పోలీసులు చేసిన సోదాల్లో మూడు కమిషనరేట్ల పరుధుల్లో కలిసి 9 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అందులో హైదరాబాద్ కమిషనరేట్ లో నాలుగు కోట్లు, సైబరాబాద్ పరిధిలో రెండు కోట్లు, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో రెండు కోట్ల రూపాయల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డబ్బులో కొందరు రాజకీయ నాయకులకు లింక్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.డబ్బుతో పాటు సుమారు 7లక్షల రూపాయల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 15వేల పెట్టీ కేసులు నమోదు చేశారు పోలీసులు.. అటు మ్యాన్ పవర్.. ఇటు సిసి కెమేరాల పర్యవేక్షణలో హైదరాబాద్ లో సర్వం సిద్ధం చేశారు పోలీసులు… ఇక ఓటు హక్కు వినియోగించుకోవడమే మిగిలింది.

Related Posts