YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ

ఓటేసేందుకు వచ్చిన రాఘవేంద్రరావును అడ్డుకున్న ఓటర్లు..!!

ఓటేసేందుకు వచ్చిన రాఘవేంద్రరావును అడ్డుకున్న ఓటర్లు..!!

 ఫిలింనగర్‌లో ఓటేసేందుకు వచ్చిన దర్శకుడు రాఘవేంద్రరావుకు చేదు అనుభవం ఎదురయింది. తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు కొద్దిసేపటి క్రితం ఫిలింనగర్‌లోని పోలింగ్ బూత్‌కు రాఘవేంద్రరావు చేరుకున్నారు. నేరుగా బూత్‌లోకి వెళ్తున్న ఆయనను గమనించిన ఓటర్లు అడ్డుకున్నారు. అందరూ క్యూలో నిల్చుంటే మీరు నేరుగా బూత్‌లోకి ఎలా వెళ్తారంటూ నిలదీశారు. దీనిని అవమానంగా భావించిన ఆయన ఓటు వేయకుండానే వెళ్లిపోయారు.  గతంలో చిరంజీవికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైనా సంగతి తెలిసిందే.

Related Posts