ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం విద్యా సంస్థలకు కేంద్రమే నిధులు కేటాయించాలి. విద్యా సంస్థలకు కేంద్రం నుంచి 764 కోట్లు మాత్రమే ఇచ్చారు. 12,780 కోట్లు ఇంకా నిధులు విడుదల చేయాలి. విద్యా సంస్థలకు నిధులు ఇవ్వకుండా ..రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. పోలవరానికి రాష్ట్రం ఖర్చు పెట్టిన నిధులు 3 వేలు కోట్లు కూడా ఇవ్వలేదు. పోలవరానికి నిధులు ఇవ్వకుండా అడ్డంకులు కలిపిస్తున్నారు. వెనుకబడిన జిల్లాల నిధులు350 కోట్లు ఇవ్వలేదు..తెలంగాణ కు మాత్రం ఇచ్చారని అన్నారు. ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతూ..చంద్రబాబు మళ్ళీ గెలవకూడదని కుట్రలు చేస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల చేత టీడీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారు. కేంద్రం పక్షపాత ధోరణి అవలంబిస్తోంది. అమరావతి కి నిధులు ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి జవదేకర్ అబద్దాలు మాట్లాడుతున్నాడని అయన ఆరోపించారు. కేంద్రమంత్రి కడప స్టీల్ ఫ్యాక్టరీ పరిశీలనలో ఉంది అని చెప్పారు. ఇప్పటివరకు స్పందన లేదు..రాజకీయ కారణాలతోనే స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వడం లేదు. ఈ నెల 10 న చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు. బీజేపీ ఏతర పార్టీల సమావేశం జరుగుతుంది.. కూటమి ఏర్పాటుపై చర్చిస్తారు. కేసీఆర్ అహంకార పూరితంగా చంద్రబాబు పై ,టిడిపి పై విమర్శలు చేసాడు. తెలంగాణ లో మహాకూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు.