YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచానికి ఎపి ఆదర్శం: చంద్రబాబు

ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచానికి ఎపి ఆదర్శం: చంద్రబాబు
ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా నాగార్జున వర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్‌ మిషన్‌ ప్రాంగణంలో ప్రకృతి వ్యవసాయ సదస్సును చంద్రబాబుశనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం పటిష్టంగా చిత్తశుద్ధితో అమలు చేస్తామని చెప్పారు.ప్రస్తుతం 5.83లక్షల మంది ప్రకృతి సేద్యం చేస్తున్నారని, ఇది 60లక్షలకు చేరాలని ఆకాంక్షించారు. 2024కు ముందే ఈ లక్ష్యానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. కత్తెర పురుగు ఉద్ధృతిని ప్రకృతి సేద్యం ద్వారా నివారించామని చెప్పారు. ఈ సేద్యంలో పరిశోధనలు, మార్కెటింగ్‌ కోసం పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థ ఐటీసీ సైతం ముందుకొచ్చిందని సీఎం తెలిపారు. ప్రకృతి సేద్యంపై మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు. అరకు కాఫీ తోటలను సహజ సేద్యం ద్వారా పండిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్‌తో పాటు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబు తదితరులు పాల్గొన్నారు. శనివారం నుంచి 10 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సుమారు 2వేల మంది మహిళా రైతులు పాల్గొన్నారు.

Related Posts