YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ ఆసుపత్రిలో క్లీన్ అండ్ గ్రీన్

ప్రభుత్వ ఆసుపత్రిలో క్లీన్ అండ్ గ్రీన్

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వెళ్లడానికి ఆధునిక వైద్యంతో పాటు స్వచ్ఛమైన గాలి ఎంతో దోహద పడుతుందని అందుకే ఆసుపత్రి పరిసరాలను పచ్చని మొక్కలతో నింపుతున్నట్లు ఆసుపత్రి అభివృద్ది కమిటి ఛైర్మన్ ఎమ్ఎల్సి రాము సూర్యారావు చెప్పారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆసుపత్రి ఆవరణలోని పరిసరాలను నర్సులు ఎన్ సిసి విద్యార్ధులు ఇతర స్వచ్ఛంద సేవ సంస్థల సభ్యుల సహకారంతో పరిశుభ్రపరిచారు. ఈ సందర్భంగా స్వచ్ఛమైన గాలులు ఇచ్చే పలు మొక్కలను నాటి నీరు పోసారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యంకన్నా స్వచ్ఛమైన గాలి ఎంతో మంచిదని పరిసరాలు పరిశుభ్రంగా వుంటే రోగులు ఆరోగ్యవంతంగా తిరిగి ఇంటికి వెళతారని సూర్యరావు చెప్పారు. అశోకుడు కాలంలో ఇంటింటా ఊరూర వనాలు ఏర్పాటు చేస్తే ఆధునికత పేరుతో అపారటమెంట్ల కల్చర్ రావడంతో పెద్ద వృక్షాలను నరికివేసి సమాజంలో వాతావరణ కాలుష్యానికి బాటలు వేస్తున్నారని ఆయన చెప్పారు, సమాజంలో స్వచ్ఛమైన గాలి వున్నప్పుడే అందరూ ఆరోగ్యంగా జీవించగలుగుతారని పశుపక్షాదులు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాయని ఇటువంటి పరిస్థితి కల్పించడానికి  ఆసుపత్రులు, ప్రభుత్వ  కార్యాలయాలు, పాఠశాలల్లో మొక్కల పెంపకం ప్రతీ ఒక్కరూ బాధ్యతగా చేపట్టాలని మన పరిశరాలు బాగుంటేనే మన మంతా ఆరోగ్యంగా ఉండగలుగుతామనే ఆలోచనప్రతీ ఒక్కరిలో కలగాలని సూర్యారావు కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ది కమీటీ సభ్యులు డా.రావి గోపాలకృష్ణయ్య, కోనేరు రవి,ఆలపాటి నాగేశ్వరరావు, రెడ్ క్రాస్ సభ్యులు నాగరాజు, చిట్టిబాబు, కెపిడిటి ఉపాద్యాయులు రామయ్య నర్సింగ్ కాలేజి విద్యార్థులు పాల్గొన్నారు.  

Related Posts