YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రేపటి క్యాబినెట్ ఇదే..! ఐదుగురి స్థానంలో కొత్త ముఖాలు

 రేపటి క్యాబినెట్ ఇదే..! ఐదుగురి స్థానంలో కొత్త ముఖాలు
తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం సగర్వంగా ఏర్పాటు కానున్నది. అయితే పాత కాబినేట్ లో మంత్రులుగా పనిచేసిన వారిలో తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్, చందూలాల్, స్పీకర్ గా పనిచేసిన మధుసూధనాచారి లు ఓటమి చవిచూశారు. వీరి స్థానంలో కొత్త వారికి స్థానం కల్పించే అవకాశం ఉంది. నాయిని నర్సింహారెడ్డికి తిరిగి హోంశాఖ అప్పగించే అవకాశం లేదని సమాచారం. ఉప ముఖ్యమంత్రులుగా వున్న ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, కడియం శ్రీహరికి తిరిగి అదే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇక మంత్రుల విషయానికోస్తే హోం మంత్రిగా  నాయిని నరసింహరెడ్డికి ఈసారి అవకాశం రాకపోవచ్చు. నాయిని నర్సింహారెడ్డిని తప్పించాలని కేసీఆర్ అనుకుంటునట్లు పార్టీ వర్గాల్లో వార్త ప్రచారంలో వుంది.  ఎన్నికల సందర్భంగా ముషీరాబాద్ స్థానం తన అల్లుడు శ్రీనివాస రెడ్డి కి టిక్కెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. దానికి పైగా అనవసర మీడియా ప్రకటలను ఇవ్వడం కుడా గులాబినేతకు ఇబ్బందిగా మారింది.  నాయిని ని తప్పించి.. అదే సమాజిక వర్గానికి చెందిన నిరంజన్ రెడ్డికి హోంశాఖ ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. ఇక  ఆర్ధికశాఖ కు ఈటెల రాజేందర్, ఐటి, మున్సిపల్ శాఖలు  కేటీఆర్ కు, భారీ నీటిపారుదల శాఖ: హరీశ్రావు, కాగా మంత్రులుగా పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎక్సైజ్ -నిరోధక శాఖ : టి. పద్మారావు గౌడ్, లక్ష్మారెడ్డి, జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, జగదీశ్ రెడ్డి ఉన్నారు. రంగారెడ్డి నుంచి గెలిచిన మల్లారెడ్డి పేరు పరిశీలనలో ఉందని సమాచారం. 
ఇక పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు పరాజయం పాలవడంతో మ్మం నుంచి రెండవసారి గెలిచిన పువ్వాడ అజయ్ కుమార్ కు మంత్రి పదవి దక్కనుంది. ఈసారి మహిళలకు కుడా మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నారు. అలేరు నుంచి రెండవసారి గెలిచిన గొంగిడి సునీతనకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ  ఇవ్వవచ్చని సమాచారం.  పద్మా దేవేందర్ రెడ్డికి ఈసారి అసెంబ్లీ స్పీకర్ ప్రమోషన్ వచ్చే అవకాశాలు వున్నాయి. 

Related Posts