YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఏపీలో కేసీఆర్ కు స్వాగతం.. కాపు నేత ముద్రగడ

ఏపీలో కేసీఆర్ కు స్వాగతం.. కాపు నేత ముద్రగడ
తెలంగాణ ప్రజలు ఎందరో త్యాగంతో తెలంగాణ తెచ్చుకున్నారు. అటువంటి తెలంగాణలో వేలు పెట్టడం ఎంతవరకు సమాంజసమో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. బుధవారం అయన కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా అయన ఇతర కాపు నేతలతో కలసి తెలంగాణలో టిడిపి ఓటమి పై గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పై విరుచుకపడ్డారు. ఓ గజ దొంగను రానివ్వకుండా కొలుకోలేని దెబ్బ కొట్టినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. రెండవ సారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్న కేసీఆర్ కు నా అభినందనలని అన్నారు. ఎపీలో ఉన్న వనరులు సరిపోక తెలంగాణలో ఉన్న వనరులపై కన్నేసిన  చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు తగిన బుద్ది చెప్పారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కు కేసీఆర్ బలమైన బహుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎపీ రాజకీయాలలో కేసీఆర్ వేలు పెడితే నేను స్వాగతిస్తాను. తెలంగాణలో ముందస్తు వల్ల ఎపీ ప్రజల్లో మేల్కోపు కలిగిందని అన్నారు. మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వ నాశనమవుతుంది. చంద్రబాబు ను ఇంటికి సాగనంపే వరకు నేను వదలనని హెచ్చరించారు. తెలంగాణలో మాదిరిగానే ఎపీలో కూడా చంద్రబాబు కు ముగింపు పలకాలని ప్రజల్ని కోరుతున్నాను. గరుడా పురాణాలు చెప్పించి ప్రజల ఆస్ధులను పందాల రూపంలో తగలబెట్టించిన ఘనుడు చంద్రబాబు. గతంలో ఓ సినిమా నటుడు...ఇప్పుడు లగడపాటితో చంద్రబాబు గరుడా పురాణాలు చెప్పించారని అయన అన్నారు. కేంద్రానికి పంపిన కాపు రిజర్వేషన్ బిల్లును వాపస్ తీసుకుని అసెంబ్లీలో రద్దు పరుస్తూ తీర్మాణం చేయాలి. వెనువెంటనే కొత్త సవరణ లతో బిల్లు పెట్టి గవర్నర్  ఆమోదంతో చట్టం చేయాలని డిమాండ్ చేసారు . ఈనెల 23న కత్తిపూడి వద్ద రాష్ట్ర కాపు జెఎసీ నేతలతో సమావేశం వుంటుందని అయన అన్నారు, ఈ భేటీలో ఉద్యమ భవిష్యత్తు కార్యచరణ పై చర్చిస్తామని అన్నారు. 

Related Posts