YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నా నియోజకవర్గం దత్తత తీసుకోండి : కోమటిరెడ్డి

నా నియోజకవర్గం దత్తత తీసుకోండి : కోమటిరెడ్డి
మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజా తీర్పును తాను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. తాను పదవి లేకున్నా ప్రజలకు సేవ చేసేందుకు ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. నల్గొండలో తన ఓటమిపై కోమటిరెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ధన ప్రవాహం వల్లే తాను ఓటమి పాలయ్యానని పేర్కొన్నారు. అయితే తన నియోజకవర్గం నల్గొండను సీఎం కేసీఆర్ దత్తత తీసుకుని అభివృద్ది చేయాలని కోరారు. రెండు చేతులు జోడించి కేసీఆర్‌ను వేడుకుంటున్నానని, తన నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నియోజవర్గ ప్రజల కోసం తానున్నానని చెప్పారు. తన ఓటమిపై కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడవద్దని సూచించారు. అయితే ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తన బంధువు రవీందర్ రావు ద్వారా నల్గొండలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు కోట్ల రూపాయలు కుమ్మరించారని ఆరోపించారు.  ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో సొమ్మసిల్లి పడిపోవడంతో కోమటిరెడ్డిని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాంగ్రెస్ కీలక నేత, సీఎం రేసులో ఉన్న పార్టీ నేతలలో ఒకరైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై నల్గొండ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాలరెడ్డి 23,698 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. నల్గొండ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన కోమటిరెడ్డి ఈ సారి ఓటమి చవిచూడటం కాంగ్రెస్ శ్రేణులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

Related Posts