YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జర్నలిస్టులందరికి త్వరలోనే ఇళ్లస్థలాలు

 జర్నలిస్టులందరికి త్వరలోనే ఇళ్లస్థలాలు
జర్నలిస్టులకు అన్ని రకాలుగా మేలు చేస్తాం గతంలో అనుకున్నాం ఇవ్వలేకపోయాం త్వరలోనే కచ్చితంగా ఇస్తాం. - జర్నలిస్టుల సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తామని అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం నాడు అయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.  మంత్రి వర్గంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం. మ్యానిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలాంటిని అమలుపరచిన ఘనత  మా ప్రభుత్వానిదే.  ఏమి చెప్పమో అదే అమలు చేశాం.  జాతీయ రాజకీయాల్లో కొత్త ప్రయోగాలు చేస్తామని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పద్దతి బాగాలేదు.  బిజెపి, కాంగ్రెస్ పార్టీలు దొందూ ..దొందే అని విమర్శించారు.  కేంద్రం తాను చేయాల్సిన పని చేయకుండా రాష్ట్రాలపై పెత్తనం చేస్తున్నది. పంచాయతీ రాజ్ వ్యవస్థ కేంద్రం చేతులో ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పోతేనే ఫ్యూడల్ వ్యవస్థ అంతమవుతుంది. మా ముందు ఉన్న సవాల్ పంచాయితీ ఎన్నికలు  హైకోర్టు ఆర్డర్ నీ వెంటనే అమలు చేయాలి.  రెండు దఫలుగా పంచాయితీ ఎన్నికలు వుంటాయిని అయన వెల్లడించారు. ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీలనింటిని భర్తీ చేస్తాం. నిరుద్యోగులను మోసం చేసే పార్టీలు చాలా ఉన్నాయని, తమకన్నా ముందు కాంగ్రెస్‌, టీడీపీ 60 ఏళ్లు పాలించాయని, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాయని కేసీఆర్ ప్రశ్నించారు. యువతకు పచ్చి అబద్దాలు చెప్పి కన్ఫ్యూజ్ చేశారని ఆరోపించారు. ఎన్ని ఉద్యోగ ఖాళీలున్నా వంద శాతం భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు.  వచ్చే 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు వస్తాయి.. ప్రతి పైసపై అవగాహన ఉంది.  ఏడాది తర్వాత సీతా రామ ప్రాజెక్టు పూర్తవుతుంది.  దేశానికి ఒక కొత్త ఆర్థిక వ్యవస్థ అవసరం. మ్యానిఫెస్టోలో లేని అంశాలను కూడా అమలు చేశామని అన్నారు.  జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే రైతు బంధు దేశమంతటా అమలు చేస్తాం. కొత్త జాతీయ పార్టీ పెరు ఇంకా పెట్ట లేదు. నిరుద్యోగ భృతి వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేస్తామని అన్నారు. సిన్సియర్ గా సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని కేసీఆర్ అన్నారు. ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబుకే క్లారిటీ లేదని  కేసీఆర్‌ విమర్శించారు. ప్రత్యేక హోదాతో వచ్చేది ఏముందని పెద్ద పెద్ద డైలాగులు కొట్టారని, హోదా విషయంలో బాబు మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా అడిగేవాళ్లు మూర్ఖులని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు ఆయనే హోదా అడుగుతున్నారని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఆంధ్రాకు రావాలని చాలా మంది అడుగుతున్నారని, వంద శాతం ఆంధప్రదేశ్‌కు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

Related Posts