YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఓట్ల శాతం పెరిగితేనే వికాసం..

ఓట్ల శాతం పెరిగితేనే వికాసం..
తిరుగులేని ఆధిక్యం. ఆధిపత్యం. ఓటమెరుగని రాజకీయ పక్షం బీజేపీ లక్షణాలు. 2014 నుంచి 2017వరకూ ఏ పార్టీకి లేని అరుదైన క్వాలిటీలు కమలం సొంతం. ఇక ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు అయితే.. విన్నింగ్ మెషీన్. ఈ ద్వయాన్ని విజయపు యంత్రంగా ఆకాశానికెత్తేశారంతా. సొంత పార్టీయే కాదు.. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలదీ అదే అభిప్రాయం. అయితే విన్నింగ్ మెషీన్‌ ఫార్ములాలు  ఇటీవలిగా మొరాయిస్తున్నాయి. సరైన ఫలితాన్నివ్వడంలేదు. పరాజయాలూ పలకరిస్తున్నాయి. ప్రస్తుత 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా కాషాయ దళానికి చేదు అనుభవాన్నే మిగిల్చాయి. ప్రధానంగా మంచి పట్టున్న రాష్ట్రాల్లో పార్టీ పట్టు కోల్పోవడం ఆలోచించాల్సిన విషయం. గెలుపు-ఓటములు సహజం. కానీ సార్వత్రిక ఎన్నికల ముందు పరాజయాలు తేలిగ్గా తీసుకోతగ్గవి కావు. అందుకే బీజేపీ జాగ్రత్త పడాలి. పార్టీని ప్రజలకు చేరువడ చేయడంతో పాటూ ఓట్ బ్యాంకు పెంచుకునే యత్నాలు ముమ్మరం చేయాలని విశ్లేషకులు అంటున్నారు. 2014 నుంచి దేశంలో బీజేపీ సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దేశం మొత్తం కమలదళం విస్తరించిన పరిస్థితి. అయితే ఇటీవలిగా పార్టీ ఫార్ములాలు సత్ఫలితాన్నివ్వడంలేదు. దీంతో ఓటములు ఎదురవుతున్నాయి. ప్రధానంగా విపక్షాలన్నీ ఏకమవుతూ కాషాయపార్టీని నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరేం చేసినా బీజేపీకి ఆదరణ తగ్గలేదు. కానీ పదిహేనేళ్లుగా పాతుకుపోయిన రాష్ట్రాల్లో పార్టీకి ఓట్ షేర్ తగ్గడం ఆశ్చర్యం కలిగించే విషయం. 
రాజస్థాన్‌లో ఎన్నికలప్పుడు ప్రభుత్వాలు మారడం సంప్రదాయంగా మారింది. ఈ ట్రెడిషన్ ప్రకారం కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. అయితే చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్‌ల్లో 15ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ప్రజలకు చేరువ కాబట్టే మూడు దఫాలుగా అక్కడ కమలం పార్టీకి ఆదరణ దక్కింది. ఇన్నేళ్లు అధికారంలో ఉన్న బీజేపీకి ప్రజాదరణ ఎక్కువే. అయితే.. ప్రస్తుత ఎన్నికల ఫలితాలను బట్టి ఆదరణ తగ్గిందని తేలింది. ఓట్ షేర్ క్షీణించడం ఏ పార్టీకైనా మంచిది కాదు. ఓట్ల శాతం అధికంగా ఉంటేనే పార్టీ క్రియాశీలకంగా ఉంటుంది. ప్రస్తుత 5రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. చత్తీస్‌గడ్‌లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైనట్లే. రాజస్థాన్‌లో ప్రతీ ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బందిలేదు. ఇక మధ్యప్రదేశ్‌ ఫలితం కూడా కమలనాథులకు కొన్ని హెచ్చరికలు చేస్తోంది. పార్టీని ప్రజలకు మరింతగా చేరువ చేయాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఇరు పార్టీల మధ్య సీట్ల వ్యత్యాసం తక్కువే. అయితే.. కాంగ్రెస్‌ను అందుకోలేకపోయింది బీజేపీ. ఫలితంగా నాలుగోసారీ అధికారం కైవసం చేసుకోవాలన్న లక్ష్యానికి దూరమైంది. మిజోరంలోనూ షేర్ కొంత తగ్గింది. ఇక తెలంగాణలో పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. మొత్తంగా తాజా రిజల్ట్ బీజేపీని జాగ్రత్తపడమనే చెప్తోంది. 2019 ఎన్నికల్లో దుమ్మురేపాలంటే ఓట్ షేర్ పెంచుకోవాలని సూచిస్తోంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలను 2019 జనరల్ ఎలక్షన్స్‌కు సెమీఫైనల్స్‌గా పరిగణించారు. ఈ రాష్ట్రాలన్నింటా 80కిపైగా లోక్‌సభ సీట్లు ఉండడమే దీనికి కారణం. లోక్ సభ స్థానాల దృష్ట్యా బీజేపీ ప్రజలను మరింతగా చేరువయ్యే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాల్సిందే. ఎందుకంటే తాజాగా ఎన్నికలు జరిగిన ఐదింట 4 రాష్ట్రాల్లో పార్టీ ఓట్ల శాతం క్షీణించింది. ఈ ఎఫెక్ట్ సార్వత్రిక ఎన్నికలపై పడొచ్చు. కారణం కాంగ్రెస్ పుంజుకుంది. అందుకే.. ఓట్ షేర్ పెంచుకునేందుకు కాషాయదళం ముమ్మరంగా కృషి చేయాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Posts