YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రియల్ బూమ్‌పై సైబర్ క్రిమినల్స్ కన్ను

 రియల్ బూమ్‌పై సైబర్ క్రిమినల్స్ కన్ను
హైదరాబాద్.. హైదరాబాద్ శివార్లలో నెలకొన్న రియల్ బూమ్‌పై సైబర్ క్రిమినల్స్ కన్నేశారు. దీని కోసం ఆన్‌లైన్‌లోని వివిధ వెబ్‌సైట్లలో ప్లాట్ల విక్రయ ప్రకటనలపై గురి పెట్టారు. ప్లాట్ల యజమానులకు వాట్సాప్ కాల్ చేసి.. డైమన్షన్ పేపర్ పొంది.. దాని ఆధారంగా ఇతరులకు విక్రయిస్తామంటూ మోసానికి పాల్పడుతున్నారు. నైజీరియా కి చెందిన సైబర్ చీటర్స్, పశ్చిమ బెంగాల్, జార్ఖం డ్, బీహార్, రాజస్థాన్, తదితర రాష్ట్రాలకు చెందిన సైబర్ క్రిమినల్స్ ఉండేవారు. అయితే తాజాగా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు కూడా సైబర్ క్రిమినల్స్‌గా అవతారమెత్తారని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అనుమానిస్తున్నా రు. ఇటీవల వారి వద్దకు వచ్చిన ఫిర్యాదులపై ప్రాథమికంగా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులకు ఈ విషయం తెలిసింది.వివిధ వెబ్‌సైట్లలో ప్లాట్ల విక్రయ ప్రకటనలపై సైబర్ క్రిమినల్స్ గురిపెట్టారు. అందులోని ఫోన్ నంబర్ల ఆధారం గా...సార్ మీ ప్రకటనను చూశాం... ఏం ధరకు అమ్మాలనుకుంటున్నారు... ఆ ప్రాంతంలో డెవలెప్‌మెంట్ ఉందా? అంటూ పలుకరిస్తారు. అలా ప్లాటు యజమానిని మాటల్లో దింపి... సార్ నేను ప్లాటు వద్దకు వెళ్లి చూస్తా ను.. ఒక సారి మీ డైమన్షన్ పేపర్ పంపించండి అంటూ కోరుతారు. అలా పేపర్ అందగానే సైబర్ మోసగాళ్లు ఆ ప్రాంతానికి వెళ్లి తిరుగుతారు. అక్కడ కనిపించే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్ల కార్యాలయాలపై ఉన్న ఫోన్ నంబర్లను రాసుకుంటారు.అయితే ఇప్పటి వరకు ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా ఘట్‌కేసర్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఓ వ్యాపారికి ఇటీవల ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. సార్... ఘట్‌కేసర్ ప్రాంతంలో నాకు 300 గజాల స్థలం ఉంది. ఆ స్థలాన్ని అమ్మేస్తున్నానని చెప్పాడు. వెంటనే వ్యాపారి... నా ఫోన్ నంబర్ ఎవరు ఇచ్చారని అడిగాడు. సార్.. నా స్థలాన్ని చూసుకునేందుకు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న మీ ఆఫీసు వద్దకు వచ్చాను.. అప్పుడు మీ కార్యాలయంలో ఎవరు లేరు. స్థానికులను అడిగితే ఈ కార్యాలయం నిర్వహిస్తు న్న వ్యాపారికి కొనుగోలు, విక్రయాల్లో మంచి పేరుంది. పేమెంట్ విషయంలో కూడా నిక్కచ్చిగా ఉంటాడని చెప్పారు.ప్రస్తుత్తం అసలు స్థల యజమాని అమెరికాలో ఉన్నట్లు తేలింది. దర్యాప్తులో రియల్ ఎస్టేట్ వ్యా పారికి వచ్చిన ఫోన్ కాల్స్, బ్యాంకు ఖాతా వివరాలు కర్నూల్, అనంతపురానికిలకు చెందినవి కావడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురైయ్యారు. సైబర్ చీటర్ల మోసాల చిట్కాలను దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు కూడా అలవాటు చేసుకుంటున్నారని తెలిసింది. ఈ అంశం కొంత కలవరాన్ని రేపుతున్నది. ఇది ఇలా ఉండగా... ఇదే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రియల్ దందా పేరుతో ఓ మహిళ నుంచి రూ.6 లక్షలను కొట్టేశారని ఫిర్యాదు నమోదైంది

Related Posts