YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చంద్రబాబే వల్లే టీ సెంటిమెంట్ దెబ్బ తిందా...

చంద్రబాబే వల్లే టీ సెంటిమెంట్ దెబ్బ తిందా...
చంద్రబాబే వల్లే టీ సెంటిమెంట్ దెబ్బ తిందా... అవుననే అంటున్నారు టీజేఎస్ నేతలు. తెలంగాణలో ఎన్నికలు ముగిసినా.. వాటి తాలూకు వాసనలు ఇంకా పోవడంలేదు. ఎవరో ఒకరు.. ఎక్కడో దగ్గర ముందస్తు ఎన్నికలపై ఏదో మాట అంటుండడంతో ఆ వేడి ఇంకా చల్లారలేదని అర్థమవుతోంది. ఎన్నికల్లో విజయం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు సంబరాలు చేసుకుంటుండగా, మిగిలిన పార్టీలు మాత్రం ఓటమికి గల కారణాల గురించి చర్చలు జరుపుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో భారీగా దెబ్బైపోయిన ప్రజాకూటమి నేతలు కూడా ఇదే పనిలో బిజీగా ఉన్నారు. టీఆర్ఎస్‌ను మరోసారి అధికారంలోకి రానీయకూడదని ఏర్పడిన ప్రజాకూటమిలో సీట్ల సర్ధుబాటు గురించే ఎక్కువ కాలం తీసుకుంది. దీనికి తోడు రెబెల్స్ గొడవలు, సీట్ల కేటాయింపు తదితర విషయాలతో ఆయా పార్టీల్లో సమన్వయం కరువైంది. పార్టీలు, నేతలు కలిసినంత వేగంగా ఆయా పార్టీల కార్యకర్తలు కలవలేకపోయారు. దీంతో కొన్ని స్థానాలను మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాల్లో ఓట్ల బదిలీ కూడా జరగలేదు. ప్రజాకూటమిలోని కాంగ్రెస్ పార్టీ 19, తెలుగుదేశం పార్టీ 2 స్థానాలను దక్కించుకున్నా.. తెలంగాణ జనసమితి, సీపీఐ అయితే ఖాతానే తెరవలేదు. ఈ ఎన్నికల్లో ఓటమిపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి.తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో జేఏసీ చైర్మన్‌గా ఉన్న కోదండరాం.. ఎంతో మంది విద్యార్థులను ఉద్యమం వైపు తిప్పడంలో సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న ఆయన.. తెలంగాణ జనసమితిని మాత్రం విజయవంతంగా నడపలేకపోయారు. మొదటి ప్రయత్నంలోనే ఆయన పార్టీకి తెలంగాణ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. అసలు ముందస్తు ఎన్నికల్లో ప్రజాకూటమి ఓటమికి కారణాలు ఏంటనే దానిపై కోదండ తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు చేసిన ప్రచారం ప్రజాకూటమి ఓటమికి కారణాల్లో ఒకటన్నారు. ఆయన ప్రచారాన్ని టీఆర్ఎస్ బాగా వాడుకుందని, దీంతో రాజకీయ పోరు కాస్తా కేసీఆర్‌, చంద్రబాబుల మధ్యే అన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇదే కోదండరాం.. చంద్రబాబును తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కూడా ప్రచారం నిర్వహించాలని కోరారట. కోదండ వ్యాఖ్యల తర్వాత టీడీపీ అభిమానులు దీనిని గుర్తు చేస్తూ ఆయనపై విమర్శలు చేస్తున్నారు.

Related Posts