YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాహుల్ ను బఫూన్ అనడంలో తప్పు లేదు - ఎంపీ కవిత

 రాహుల్ ను బఫూన్ అనడంలో తప్పు లేదు - ఎంపీ కవిత
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాహుల్ గాంధీని బఫూన్ అనడంలో తప్పేమీ లేదు. ప్రతిపక్ష నేత పార్లమెంటు నిబంధనలు ఉల్లంఘిచి దేశ ప్రధానిని ఎలా హత్తుకున్నారో దేశ ప్రజలంతా చూశారపి తెరాస ఎంపీ కవిత అన్నారు. బుధవారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.  సిల్లీగా ప్రవర్తించేవారిని బఫూనే అంటారు . ఫెడరల్ ఫ్రంట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. మా ఎజెండా దేశ ప్రజల కోసం పనిచేయడం.. రాజకీయ పార్టీల కోసం కాదని అన్నారు. దేశంలో అనేక రాజకీయ కూటములున్నాయి..కొన్ని విజయం సాధించాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారం లో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచడంలో ఘోరంగా విఫలమైంది. బిజెపి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తటస్థ కూటమి ఏర్పాటు కావాల్సిన సమయం ఏర్పడింది. రాహుల్ గాంధీ ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే రాజకీయ కూటమిలో టిఆర్ఎస్ లేదని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా వ్యతిరేకిస్తున్న స్ధానిక పార్టీల జాబితాలో మేము ఉన్నాం. ఒక అభ్యర్థి ప్రధాని కావడం ఒక పార్టీ అధికారం లోకి రావడం కాదు దేశ ప్రజలసమస్యలను పరిష్కరించడం ముఖ్యం. తెలంగాణలో ప్రజా సమస్యలను పరిష్కరించాం. జాతీయ స్ధాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఫెడరల్ ఫ్రంట్ పాత్ర ఉండబోతుంది. నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ భారీ విజయాలేమీ సాధించలేదు. పెద్ద కాంగ్రెస్ కాదు చిన్న కాంగ్రెస్ గానే కాంగ్రెస్ పరిస్థితి ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో స్దానిక పార్టీలు పెద్ద పాత్రపోషించాయి. జాతీయ రాజకీయాలలో ప్రజలకు దగ్గరగా ఉండే స్దానిక పార్టీలు పెద్ద పాత్ర పోషిస్తాయి. కాంగ్రెస్ బిజెపియేతర పార్టీలతో కలిసి పనిచేస్తాం. ఎన్డీఏ కూటమికి టిఆర్ఎస్ టీమ్ బి గా లేదు  భారత ప్రజల టీమ్ గా టిఆర్ఎస్, ఫెడరల్ ఫ్రంట్ ఉండబోతుందని ఆమె అన్నారు..

Related Posts