YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జంపు జిలానీకు కేసీఆర్ ప్రోత్సహం

జంపు జిలానీకు కేసీఆర్ ప్రోత్సహం
నిరుద్యోగ భృతిపై అప్పుడే కేసీఆర్ మాటమార్చారు.  ఉద్యోగుల వయోపరిమితి ,రైతు రుణమాఫీ ,కేసీఆర్ మాటమార్చారు.  కేసీఆర్ ది అబద్దాల కోరు ప్రభుత్వం అని తేలిపోయిందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. మూడు రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ పై తొలిసంతకం చేసిన ఘనత కాంగ్రెస్ ది. కాంగ్రెస్ క్రెడిబిలిటీ ఏంటో ...కేసీఆర్ క్రెడిబిలిటీ ఎంతో జనం అర్థం చేసుకుంటున్నారు. పంచాయితీల్లో బీసీ రిజర్వేషన్ లపై ప్రభుత్వం ఎందుకు పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరుతో వేయి మంది బీసీ సర్పంచ్ లు ,9వేల మంది వార్డ్ మెంబర్ లు నష్టపోతున్నారు. బీసీలు మేల్కొని ..ప్రభుత్వం తీరును ప్రశ్నించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో గడబిడి జరిగింది. పోలింగ్ ఓట్లకు ..కౌంటింగ్ ఓట్లలో తేడావచ్చింది నిజం . వేలసంఖ్యలో ఓట్ల తేడా ఎలా వచ్చిందో ఈసీ ,ప్రభుత్వం చెప్పాలని అయన అన్నారు. ఓటింగ్ పర్సెంటేజ్ రాత్రికి రాత్రి 11శాతం ఎలా పెరిగిందని అయన అడిగారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఓడినా .. ప్రజాలపక్షాన నిలబడతాం. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పార్టీ మారినందుకు ఆయనపై అనర్హత వేటు వేయాలని పిర్యాదు చేస్తున్నాం. డిఫెక్షన్ లా ప్రకారం దామోదర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ప్రజాప్రతినిదుల  పిరాయింపులను ప్రోత్సహించారు. దేశంలో ఇంత పెద్దఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించిన సీఎం గా కేసీఆర్ నిలిచిపోతారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు .. ఎమ్మెల్సీ లపై వేటు వేయాలని గత నాలుగేళ్లుగా మేము ఎన్నిసార్లు పిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ లపై టిఆర్ఎస్ పిర్యాదు చేయగానే చర్యలు ప్రారంభమైయ్యాయి. ఇంత పక్షపాత ధోరణి అన్యాయం .. మీకు ఒక చట్టం .. మాకు ఒక చట్టమా అని నిలదీసారు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా దామోదర్ రెడ్డి,ఎం.ఎస్ ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ పింఛన్ పెంపు బడ్జెట్ తరువాత అనడం ప్రజలను మోసం చేయడమే. ఉద్యోగులకు రిటైర్మెంట్ వయోపరిమితి పెంపు పై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. జనవరి నుంచే ఈ హామీలను నెరవేర్చాలి . లక్ష రుణమాఫీ ఏకకాలంలో చెయ్యాలి. కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన హామీపై తొలి సంతకం పెట్టారు. ఇది కాంగ్రెస్ క్రెడిబులిటీ .. కేసీఆర్ క్రెడిబులిటీ  కూడా నిలబెట్టుకోవాలి. పంచాయితీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్స్  22 శాతానికి తగ్గించడం అన్యాయం. సుప్రీం కోర్ట్ లో ప్రభుత్వం ఎందుకు స్పెషల్ లీవ్ పిటీషన్ వేయలేదని అన్నారు. ఈ చర్యవల్ల దాదాపు వెయ్యి మంది బీసీలు సర్పంచు అయ్యే అవకాశం కోల్పోతారు. అలాగే తొమ్మిది వేల మంది బీసీలు వార్డు మెంబర్స్ అయ్యే అవకాశం కోల్పోతారు. ఏవీఎం లల్లో ఏదో గందరగోళం జరిగిందనే అనుమానం మాకు ఉంది. లోక్ సభ ఎన్నికల్లో టిడిపి తో పొత్తు ఉండాలా వద్దా అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని అన్నారు.

Related Posts