YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎవరు ఎన్ని కుట్రలు,కుతంత్రాలు పన్నిన కేసిఆర్ వెంటే తెలంగాణా ఉద్యోగులు తెలంగాణా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ .పద్మా చారి

ఎవరు ఎన్ని కుట్రలు,కుతంత్రాలు పన్నిన కేసిఆర్ వెంటే తెలంగాణా ఉద్యోగులు     తెలంగాణా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ .పద్మా చారి
ఎవరు ఎన్ని  కుట్రలు , కుతంత్రాలు  పన్నిన  సమస్త తెలంగాణ ఉద్యోగులు, పెన్సనర్స్, యావత్ తెలంగాణ సమాజం ముఖ్య మంత్రి కేసిఆర్ కు వెన్నుదన్నుగా ఉంటామని తెలంగాణా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ .పద్మా చారి స్పష్టం చేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రము లో జరిగిన జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించి తిరిగి రాష్ట్ర ముఖ్య మంత్రిగా కల్వకుంట్ల చంద్ర శీకార్ రావు పదవి భాద్యతలు చేపట్టడం పట్ల టి యు ఎస్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యాలయం లో రాష్ట్ర సీఎం గా కేసీఆర్ భాద్యతలు చేపట్టిన నేపథ్యం లో అభినందనలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పద్మా రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాదనకై 2001 నుండి , టి.ఆర్.ఎస్ పార్టీ ప్రారంభించిన నాటి నుండి, ఆంధ్రప్రభుత్వ నిరంకుశత్వ ధోరణిని ఎదురొడ్డి తెలంగాణ 
రాష్ట్ర సమితి తో కలిసి తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించినదని పేర్కొన్నారు.  తెలంగాణ ఉద్యోగుల సంఘం (టి యు ఎస్),కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఆంధ్ర పాలకులు ముప్పు తిప్పలు పెట్టినప్పటికినీ,అతనితో వెన్నంటి ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా భావించి కీ.శే. ప్రో.జయశంకర్ సార్ మరియు ఆర్.విద్యాసాగర్ రావు గార్లతో కలిసి నీళ్లు - నిధులు నియామకాలు గురించి మరియు 610 జీ.వో , 6పాయింట్స్  ఫార్మూలా, రాష్ట్రపతి ఉత్తర్వులు (ముల్కి రూల్స్ ) పైన తెలంగాణ ఉద్యోగుల సంఘం  టి యు ఎస్  చర్చోప చర్చలు జరిపిందన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్  ఉంటే భవిష్యత్ తరాలు ఏ విధంగా నష్టపోతామనే విషయాన్ని తెలంగాణ సమాజానికి విసదీకరించి, సమైక్యాంద్రోల ఆత్మాభిమానం కొరకు పోరాడుతూ, నీళ్లు, నిధులు,నియామకాల్లో మనకు న్యాయం జరగదని మన పాలన మనమే చేసుకోవాలనీ తెలంగాణ సమాజానికి వివరిస్తూ ఉద్యుమ స్ఫూర్తి రగిలించి ఉద్యమించిన సంఘం - తెలంగాణ ఉద్యోగుల సంఘం మని పద్మా రావు పేర్కొన్నారు. టి యు ఎస్ ఇటీవల 2018 డిశంబర్ లో జరిగిన శాసభ సభ ఎన్నికల్లో వలస వాదులను స్వాగతిస్తే - తెలంగాణ పరిస్ధితి ఏ విధంగా ఉంటుదంని తెలంగాణ ఉద్యోగుల సంఘం  (టి యు ఎస్ )అధ్యక్షులు పూస్ గుచ్చినట్లు తెలంగాణ సమాజానికి ఈ క్రింద విధంగా వివరరించారు. తెలంగాణ పరిపాలనలో సమైక్య వాదుల ప్రాభల్యం మరో 15 సం. కోనసాగించడానికి కుట్రపన్నుతారనీ.హైకోర్టు ను 9,10 షెడ్యూల్లను విడదీయకుండా కాలయాపన చేస్తరనీ,సెక్షన్ 8 ని అమలు చేయడానికి సాయ శక్తుల పని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడానికి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారనీ ఇలాంటి కుట్రలు , కుతంత్రాలకు అడ్డుకట్ట వేయాలని సమస్త తెలంగాణ ఉద్యోగులు, పెన్సనర్స్, తెలంగాణ సమాజం కేసిఆర్ గారి వెన్నుదన్నుగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ సమావేశం లో సంఘం ప్రధాన కార్యదర్శి పవన్,మహిళా అధ్యక్షురాలు కానక తారా,సంఘం ప్రతినిధులు ఎండి ఫయాజ్ ,వెంకట్ భాస్కర్,యాదగిరి  తదితరులు పాల్గొన్నారు.

Related Posts