YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

రబడాపై సస్పెన్షన్ పడే అవకాశం.?

 రబడాపై సస్పెన్షన్ పడే అవకాశం.?

- మొన్న కెప్టెన్‌కి.. నేడు బౌలర్‌కి.. జరిమానా!

- రబడాకు వచ్చే 24 నెలల్లో మరో 8 డిమెరిట్ పాయింట్లు వస్తే..ఇంతే 

భారత్‌తో జరిగిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు కారణంగా రెఫరీ జట్టు ఫీజులో పదిశాతం, కెప్టెన్ ఫీజులో 20శాతం కోత విధించారు. తాజాగా ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే తన దురుసు ప్రవర్తనతో రెండుసార్లు డిమెరిట్ పాయింట్ అందుకున్న రబడా ఐదో వన్డేలో అదే విధంగా ప్రవర్తించడంతో మరో డిమెరిట్ పాయింట్, తన ఫీజులో 15శాతం కోత విధించారు. నిన్న జరిగిన వన్డేలో భారత ఓపెనర్ ధవన్ ఔట్ అయిన తర్వాత రబడా ఐసీసీ ఆటగాళ్ల ప్రవర్తన కోడ్‌ని ఉల్లంఘించాడు. ధవన్ పెవిలియన్‌కి వెళ్తుంటే.. అతనికి చేయి ఊపుతూ, పలు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆర్టికల్ 2.1.7 ‘అంతర్జాతీయ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ ఔట్ అయినప్పుడు చేతులతో సైగలు చేయడం లేదా అతనికి/ఆమెకి కోపం తెప్పించే విధంగా ప్రవర్తించడం’ ప్రకారం ఫీల్డ్ అంపైర్లు ఇయాన్ గౌల్డ్, షాన్ జార్జ్‌, థర్డ్ అంపైర్ అలీందార్, ఫోర్త్ అంపైర్ బొన్‌గాని జెలె రబడా చేసింది తప్పు అని నిర్ధారించారు. గతంలోనూ రబడా శ్రీలంకతో జరిగిన వన్డేలో మూడు, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌లో ఒక డిమెరిట్ పాయింట్లు అందుకున్నాడు. ఒకవేళ రబడాకు వచ్చే 24 నెలల్లో మరో 8 డిమెరిట్ పాయింట్లు వస్తే.. అతనిపై సస్పెన్షన్ పడే అవకాశం ఉంది.

Related Posts