YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇందూర్ లోని రైల్వే పనులకు అనుమతులు మంజూరు

 ఇందూర్ లోని రైల్వే పనులకు అనుమతులు మంజూరు
నిజామాబాద్ జిల్లాలోని వివిధ రైల్వే పనులకు రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. రైల్వే అండర్ బ్రిడ్జ్ , రోడ్ ఓవర్ బ్రిడ్జ్, రైల్వే గేట్లు, లెవెల్ క్రాసింగ్ గేట్లను వెడల్పు చేయాలని  నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఈ ఏడాది జనవరి 24న రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రైల్వేమంత్రి పీయూష్ రైల్వే పనుల పురోగతి, అనుమతులను తెలియజేస్తూ ఎంపీ కవిత కు లేఖ రాశారు. మన్మాడ్- సికింద్రాబాద్ రైల్వే లైన్ లో నిజామాబాద్- నార్సి మధ్య రైల్వే అండర్ బ్రిడ్జి మరొక దాని కోసం ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ టౌన్ లో విజయ టాకీస్ సమీపంలో చేపట్టిన ఆర్ యు బి పనులను త్వరగా పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇదే రైల్వే లైన్ లో బైపాస్ రోడ్ లో ఆర్.బి నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఎడపల్లి మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 7.5 మీటర్ల లెవెల్ క్రాసింగ్ గేట్ ను 10 మీటర్ల మేరకు పెంచేందుకు అనుమతించారు. వీలైనంత త్వరగా పనులు చేపట్టి పూర్తి చేస్తామని తెలిపారు అలాగే బోధన్ లో జానకంపేట్- బోధన్ మధ్య  జరుగుతున్న లెవెల్ క్రాసింగ్ గేటు వెడల్పు పనులు త్వరితంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే హైదరాబాద్ - మెదక్ - బోధన్ రోడ్ లో నవీపేట మండలంలో ప్రస్తుతమున్న 9 మీటర్ల లెవెల్ క్రాసింగ్ గేట్ల ను11 మీటర్లకు  వెడల్పు చేసేందుకు అనుమతించారు.  త్వరితగతిన ఈ పనులను కూడా చేపట్టి పూర్తి చేస్తామని రైల్వే మంత్రి ఫేషియల్ నిజామాబాద్ ఎంపీ కవిత కు రాసిన లేఖలో హామీ ఇచ్చారు. నాలుగేళ్లుగా పెండింగ్ రైల్వే పనులకు సంబంధించిన రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు, ఫాలో అప్ చేస్తున్నానని, మంత్రి లేఖ ద్వారా అన్ని అనుమతులు, పనుల పూర్తికి హామీ లభించింది అని ఎంపి కవిత తెలిపారు. పనులు పూర్తవుతున్నందుకు తనకు సంతోషంగా ఉందని ట్విట్టర్ లో  ఎంపి కవిత పేర్కొన్నారు.

Related Posts