YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జీహెచ్ఎంసీ క‌మ్యునిటి ఆర్గ‌నైజ‌ర్ల వేత‌నం పెంపు ఇందిరా పార్కు నుండి హిందీ మ‌హా విద్యాల‌యం వ‌ర‌కు స్టీల్ బ్రిడ్జి పొడ‌గింపు

జీహెచ్ఎంసీ క‌మ్యునిటి ఆర్గ‌నైజ‌ర్ల వేత‌నం పెంపు  ఇందిరా పార్కు నుండి హిందీ మ‌హా విద్యాల‌యం వ‌ర‌కు స్టీల్ బ్రిడ్జి పొడ‌గింపు
జీహెచ్ఎంసీ స్టాండింగ్ క‌మిటి స‌మావేశం న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న నేడు జ‌రిగింది. ఈ స‌మావేశానికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్‌తో పాటు స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులు గొల్లూరు అంజ‌య్య‌, సింగిరెడ్డి స్వ‌ర్ణ‌ల‌త‌, మ‌హ్మ‌ద్ మూర్తుజ అలీ, న‌స్రీన్ సుల్తాన‌, అబ్దుల్ వాహెబ్‌, మ‌హ్మ‌ద్ మాజిద్ హుస్సేన్‌, వి.శ్రీ‌నివాస్‌రెడ్డి, ఎన్‌.శేషుకుమారి, తూము శ్ర‌వ‌ణ్‌కుమార్‌, ఎన్‌.జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌, ఆల‌కుంట స‌ర‌స్వ‌తిలు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్ కమిష‌న‌ర్లు, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, చీఫ్ ఇంజ‌నీర్లు ఇత‌ర అధికారులు కూడా ఈ స్టాండింగ్ క‌మిటికి హాజ‌ర‌య్యారు.ఈ సందర్బంగా ఈ సంద‌ర్భంగా స్టాండింగ్ క‌మిటిలో ఈ క్రిందితీర్మాణాలు చేసారు.
* శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించి ముఖ్య‌మంత్రిగా మ‌రోసారి ప‌ద‌వీ బాధ్య‌లు స్వీక‌రించిన కేసీఆర్‌ను అభినందిస్తూ తీర్మానం.
* ఇటీవ‌ల జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించిన జీహెచ్ఎంసీ అధికారుల‌ను అభినందిస్తూ తీర్మానం.
* 2019-20 సంవ‌త్స‌రానికిగాను బ‌డ్జెట్ ముసాయిదాను ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది. వ‌చ్చే స్టాండింగ్ క‌మిటి స‌మావేశంలో ఈ బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌పై పూర్తిస్థాయి చ‌ర్చ‌లు నిర్వ‌హించి జ‌న‌వ‌రి 10వ తేదీలోపు జ‌న‌ర‌ల్ బాడిలో తిరిగి చ‌ర్చించి తీర్మానం చేయాల్సి ఉంటుంది.
* 2018-19 సంవ‌త్స‌రానికిగాను 14వ ఆర్థిక సంఘం నిధులు విడుద‌ల చేయ‌డానికి సాధించిన ల‌క్ష్యాల‌తో కూడిన నివేదికను గ‌జిట్ రూపొందించ‌డానికి తీర్మాణానికి ఆమోదం.
* జీహెచ్ఎంసీలో ఔట్‌సోర్సింగ్ ప‌ద్ద‌తిపై ప‌నిచేస్తున్న 250 మంది ఇంజ‌నీర్ల సేవ‌ల‌ను మ‌రో సంవ‌త్స‌రం పాటు కొన‌సాగించేందుకు తీర్మానం.
* ఇందిరా పార్కు నుండి న‌ల్ల‌కుంట హిందీ మ‌హావిద్యాల‌యం వ‌ర‌కు స్టీల్ బ్రిడ్జిను పొడ‌గించాల‌ని నిర్ణ‌యం.
* అర్బ‌న్ క‌మ్యునిటి డెవ‌ల‌ప్‌మెంట్‌లో ప‌నిచేస్తున్న క‌మ్యునిటీ ఆర్గ‌నైజ‌ర్ (సి.ఓ)ల గౌర‌వ వేత‌నాన్ని మ‌రో వెయ్యి రూపాయ‌లు పెంచాల‌ని నిర్ణ‌యం.
* ప్ర‌స్తుతం అమ‌లులో, పెండింగ్‌లో ఉన్న ఇంజ‌నీరింగ్ ప‌నులు, స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాలు త‌దిత‌ర అంశాలపై స‌ర్కిళ్ల వారిగా కార్పొరేట‌ర్లు, ప్ర‌జాప్ర‌తినిధులతో స‌మీక్ష స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం.
* స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌-2019లో హైద‌రాబాద్ న‌గ‌రాన్ని అగ్ర‌స్థానంలో ఉంచేందుకు కార్పొరేట‌ర్లు మ‌రింత చురుగ్గా పాల్గొనాల‌ని నిర్ణ‌యం.
* కాంట్రాక్ట్ పై ప‌నిచేస్తున్న కొంద‌రు రిటైర్డ్ అధికారుల‌ను కొన‌సాగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

Related Posts