YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హోంమంత్రిగా మహమూద్‌ అలీ బాధ్యతలు స్వీకరణ

హోంమంత్రిగా మహమూద్‌ అలీ బాధ్యతలు స్వీకరణ
తెలంగాణ హోంమంత్రిగా మహమూద్‌ అలీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కేసీఆర్‌ తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మహమూద్‌ అలీకి హోంశాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నాంపల్లిలోని యూసుఫైన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మహమూద్‌ అలీ.. అక్కడి నుంచి సచివాలయానికి చేరుకొని డీ బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ప్రభంజనం సృష్టించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. 

Related Posts