YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కారెక్కనున్న టీటీడీపీ నేతలు

కారెక్కనున్న టీటీడీపీ నేతలు
తెలంగాణలో టీడీపీ ఖాళీ కాబోతుంది. ఖమ్మం జిల్లాలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ తీర్దం పుచ్చుకోబోతున్నారు. అందులో ఒకరిని మంత్రి పదవి వరించే అవకాశం ఉందంటున్నారు. సత్తుపల్లి నియోజక వర్గం నుంచి మరో సారి గెలిచిన సండ్ర వెంకట వీరయ్య టీడీపీని వీడి టీఆర్ ఎస్‌లో చేరడంతో పాటుగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు అత్యంత ఆత్మీయుడైన మచ్చా నాగేశ్వర రావును కూడా గులాబీ కండువా కప్పించేం దుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ప్రాథమిక చర్చలు జరిగి, ఒప్పందాలు కుదరడంతో టీఆర్‌ఎస్‌లోకి జంప్ కావడానికి సంసిద్దతను వ్యక్తం చేశారు. అయితే, ఇంకా కొన్ని లాంఛనాలు పూర్తి కావలసి ఉంది. ఖమ్మంలో పట్టు సాధించడానికి టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదపడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సండ్ర వెంకట వీరయ్య కూడా ‘పడి’పోయారంటున్నారు. పార్టీ మారడం తప్ప మరో మార్గం లేదని భావించిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ సమక్షంలో త్వరలోనే గులాబీ కండువా కప్పుకోబోతున్నారని తెలిసింది.  తెలంగాణలో టీడీపీని పూర్తిగా కనుమరుగు చేయడానికి  టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహం ఖరారు చేసింది.  అసెంబ్లీ ఎన్నికల్లో  సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజక వరాల్లో గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ లో చేర్చుకోవడం ద్వారా టీడీపీ శాసనసభా పక్షం మొత్తాన్ని టీఆర్‌ఎస్ లో విలీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 28న సండ్ర వెంకట వీరయ్య టీఆర్‌ఎస్ పార్టీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు జరిగపోయాయి. అశ్వారావుపేట శాసనసభ్యుడు మచ్చా నాగేశ్వర రావు కూడా టీఆర్‌ఎస్ లో చేరే అవకాశం ఉంది. అయితే ఆయనకు ఇంకా అదికారిక పిలుపు రాలేదంటున్నారు. మధ్యవర్తుల నుంచి అందిన సమాచారం మేరకు టీఆర్‌ఎస్‌లు చేరడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య కూడా రెండు మూడు రోజుల్లోనే సమసిపోతుందంటున్నారు. మంత్రి మండలి విస్తరణలోపు ఈ చేరికలు జరిగిపోతే కేసీఆర్ క్యాబినేట్‌లో సండ్రకు చోటు దక్కే అవకాశం ఉందని తెలు స్తోంది. తమ నాయకుడికి మంత్రి పదవి ఖాయమయ్యిందని సండ్ర అనుచరులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. టీడీపీ అధినేతతో ఇప్పటికే సండ్ర వెంకట వీరయ్య పార్టీ మారడంపై చర్చించారని అంటున్నారు. రాజకీయ మనుగడతో పాటుగా జిల్లాలో తన ఉనికిని కాపాడుకుంటూ, నియోజక వర్గ ప్రజలకు సేవ చేసేందుకే పార్టీ మారవలసి వస్తుందని ఆయన అనుచరులు వాదిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గెలిచి టీఆర్ ఎస్‌లో చేరిన వారి అంశం కూడా చర్చకు వచ్చినట్లు సండ్ర వర్గీయులు వెల్లడించారు.  సండ్ర వెంకట వీరయ్య టీఆర్ ఎస్‌లో చేరడం పై స్పష్టత వచ్చినప్పటికీ  మరో టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్ లో చేరే అంశం ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఇంత వరకు నాగేశ్వర్ రావును ఎవ్వరూ కూడా నేరుగా సంప్రదించలేదని అంటున్నారు. సండ్ర వెంకట వీరయ్యతో రహస్యంగా చర్చలు జరిపింది వాస్తవమేనని అంగీకరించిన నాగేశ్వరరావు ఎవరైనా తనను సంప్రదిస్తే పార్టీ మారడంపై నిర్ణయం తీసుకుంటానని చెప్తున్నారు. 2014లో తుమ్మల టీఆర్‌ఎస్ లో చేరినప్పుడు రమ్మని పిలిస్తే తాను టీడీపీని వీడి రాలేనని సున్నితంగా తిరస్కరించారు. ఇటీవలి  ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వడంతో ఇక ఆ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదనే ఉద్దేశంలో పార్టీ మారాలనే ఆలోచనకు మత్సా వచ్చాడంటున్నారు. తనను ఎవరూ సరిగా ఆహ్వానించడం లేదనే అలకలో మచ్చా నాగేశ్వర రావు ఉన్నట్లు తెలిసింది.  టీఆర్ ఎస్ నేతలు మాత్రం సండ్ర  వెంకట వీరయ్యను పిలిస్తే చాలు మత్సను కూడా తీసుకు వచ్చేస్తాడు అనుకుంటున్నారు. అయితే సండ్ర మాత్రం మచ్చా నాగేశ్వరరావుపై తీవ్రమైన ఒత్తడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనను అడ్డుపెట్టుకుని సండ్ర మంత్రి పదవి లాభపడతున్నాడని మత్సా నాగేశ్వర రావు తన సన్నిహితులతో అన్నట్లు వెలుగులోకి వచ్చింది.  పార్టీ మారితే తనకి ఒనగూడే ప్రయోజనాలు ఏంటో టీఆర్‌ఎస్ పెద్దలు ఎవరైనా నేరుగా నాతో మాట్లాడితే అప్పుడు ఆలోచిద్దామని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. సండ్ర వెంకట వీరయ్యతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన టీఆర్‌ఎస్ ఎంపీ ఒకరు మాట్లాడి ఒప్పించినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరితే మంత్రి పదవి కూడా ఇస్తామని సండ్రకు ఆయనే హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే సండ్రతో పాటు అశ్వారావుపేట ఎమ్మెల్యేను కూడా తనతో తీసుకు రావాలని షరతు పెట్టినట్లు తెలిసింది.

Related Posts