YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హత్య చేయించేందుకు కుట్ర

హత్య చేయించేందుకు కుట్ర

తనను హత్య చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందంటున్నారు టీఆర్ఎస్ బహిష్కృత నేత , ఎమ్మెల్సీ రాములు నాయక్. టీఆర్ఎస్ నుంచి ప్రాణహాని ఉందని.. రోడ్డు ప్రమాదం రూపంలోనే, మరో ప్లాన్‌తో హతమారుస్తారని ఆరోపించారు. సోమవారం మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ను రాములు కలిశారు. పార్టీ మారినందుకు ఛైర్మన్ జారీ చేసిన నోటీసులపై వివరణ ఇచ్చేందుకు వచ్చారు. అనంతరం మాట్లాడిన నాయక్.. సంచలన ఆరోపణలు చేశారు. తాను పార్టీ మారానని.. దీనిపై వారంలోపు వివరణ ఇవ్వమని మండలి ఛైర్మన్ తనకు నోటీసులు పంపారని గుర్తు చేశారు. వివరణ ఇచ్చేందుకు తనకు 4 వారాల గడువు కావాలని కోరానని.. ఛైర్మన్ మాత్రం అవకాశం ఇవ్వడం లేదన్నారు. తాను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా వచ్చానని.. సోషల్ వర్కర్‌గా గుర్తించి తనను మండలికి పంపించారని గుర్తు చేశారు. తనను ఖతం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు రాములు నాయక్. తన హత్యకు సుపారీ కూడా ఇస్తారని.. ఏడాది క్రితం నుంచే తనను టార్గెట్ చేశారన్నారు. తనకు ఏ హాని జరిగినా.. ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. తనను ఏదో ఒక కేసులో ఇరికించి.. ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని కుట్ర జరుగుతోందన్నారు. గిరిజనుల తరఫున మాట్లాడుతున్నందుకే తన మీద కక్ష కట్టారన్నారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదన్నారు రాములు నాయక్. తాను కాంగ్రెస్ పార్టీలో సభ్యుడ్ని కాదని.. గిరిజన సమస్యలపైనే రాహుల్ గాంధీని కలిశానన్నారు. రిజర్వేషన్లు పెంచాలని వినతిపత్రం మాత్రమే ఇచ్చానన్నారు. అసలు టీఆర్ఎస్‌లో మొన్నటి వరకు పొలిట్ బ్యూరోనే లేదు.. తనపై మండలి ఛైర్మన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో తాను పొలిట్ బ్యూరో సభ్యునిగా పేర్కొన్నారని గుర్తు చేశారు

Related Posts