YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో వణికిస్తున్న వాయుకాలుష్యం

తెలంగాణలో వణికిస్తున్న వాయుకాలుష్యం

తెలంగాణలో రోజు రోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం వణికిస్తోంది. దీనికి తోడు చలికాలం కూడా కావడంతో గాలి నాణ్యత మరింత క్షీణిస్తోంది. ప్రమాదకర ధూళికణాలతో పాటు 40 రకాల ఉద్ఘారాలు వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ వీటి ప్రభావం పెరుగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. గాలిలో విడుదలవుతున్న ప్రమాదకర సూక్ష్మ, అతి సూక్ష్మ ధూళి కణాలు కాలుష్యాన్ని పెంచుతున్నాయి. వీటి ప్రభావం వేసవి, వర్షాకాలంతో పోలిస్తే చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో వర్షపు నీటితో ఉద్ఘారాలు నేలకు చేరుతాయి. వేసవి కాలంలో అయితే గాలిలో పైకి వెళతాయి. చలికాలంలో వాతావరణం స్తబ్దుదా ఉండగా గాలి ఎటూ వెళ్లదు. కాలుష్య ఉద్ఘారాలు అక్కడికక్కడే ఉండిపోతాయి. దీంతో పీల్చే గాలిలోంచి కాలుష్య ఉద్ఘారాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి ఆరోగ్యానికి హాని చేస్తాయి.ప్రమాదకర కాలుష్య ఉద్ఘారాలు నిర్దేశిత పరిమితుల కంటే ఎక్కువగా విడుదలవుతూ హైదరాబాద్ నగరంపై విరుచుకుపడుతున్నాయి. అటు జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్‌లో పరిశ్రమలు, వాహనాలు భారీ భవనాల నిర్మాణాలను నుంచి వచ్చే దుమ్ము,ధూళి వాయు కాలుష్యానికి కారణం అవుతున్నాయి. జనాభాకు తగ్గట్లుగా అవసరాలు పెరుగుతునప్పటికీ కాలుష్య నియంత్రణ చర్యలు సరిగ్గా తీసుకోకపోవడం ఈ పరిస్థితికి కారణమవుతోంది. వీటిని నియంత్రించే చర్యలు చేపట్టడంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఘోరంగా విఫలమవుతోందని వాతావరణ నిపుణులు అంటున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వాయు కాలుష్యం పెరుగకుండా కొంతలో కొంత అరికట్టవచ్చని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

Related Posts