YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

భారత హాకీ జట్లకు స్పాన్సర్‌గా ‘ఒడిసా’

Highlights

  • లోగోను ఆవిష్కరించిన రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్
భారత హాకీ జట్లకు స్పాన్సర్‌గా ‘ఒడిసా’


 భారత హాకీ జట్లతో భాగస్వామ్యం  కావడం చాలా సంతోషకరమని ఒడిసా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 
అన్నారు. హాకీ జట్టుకు రాష్ట్ర ప్రభుత్వ  స్పాన్సర్‌షిప్‌కు సంబంధించిన లోగాను  ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇకపై ఆడనున్న టోర్నీలలో కొత్త జెర్సీలతో మహిళా, పురుషుల హాకీ జట్లు బరిలోకి దిగనున్నాయి. జాతీయ హాకీ (పురుషులు, మహిళలు) జట్లకు రాష్ట్రం తరపున ఐదేళ్లపాటు స్పాన్సర్‌షిప్ ఇవ్వనున్నట్టు ఒడిసా రాష్ట్ర  ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ హాకీ జట్టుకు  ఒక రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్‌గా వ్యవహరించబోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. హాకీ జట్టు స్పాన్సర్‌షిప్‌కు సంబంధించి లోగాను ఒడిసా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆవిష్కరించారు. ఇకపై ఆడనున్న టోర్నీలలో కొత్త జెర్సీలతో మహిళా, పురుషుల హాకీ జట్లు బరిలోకి దిగనున్నాయి.ఈ సందర్భంగా సీఎం పట్నాయక్ మాట్లాడుతూ..భారర్ హాకీ జట్టుకు ధన్యవాదాలు తెలిపారు. హాకీ అనేది ఒడిసాలో క్రీడ కంటే ఎక్కువ.. అదే జీవితమైపోయిందన్నారు.. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో పిల్లలు నడిచేటప్పుడు హాకీ కర్రలతో నడక నేర్చుకుంటారు’అని  పట్నాయక్ పేర్కొన్నారు.

ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ఎఫ్ఐహెచ్, భారత ఒలింపిక్ అసోసియషన్ అధ్యక్షుడు నరేందర్ దృవ్ భత్రా సహా భారత లెజెండ్ హాకీ క్రీడాకారులు దిలీప్ తిర్కీ, ధన్‌రాజ్ పిల్లాయ్, వీరెన్ రాస్క్విన్హా తదితరులు హాజరయ్యారు.

జాతీయ హాకీ (పురుషులు, మహిళలు) జట్లకు రాష్ట్రం తరపున ఐదేళ్లపాటు స్పాన్సర్‌షిప్ ఇవ్వనున్నట్టు ఒడిసా రాష్ట్ర  ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ హాకీ జట్టుకు  ఒక రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్‌గా వ్యవహరించబోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఒడిసా రాష్ట్రం నుంచి ప్రముఖ హాకీ క్రీడాకారుల్లో దిలీప్ తిర్కీ, ఇగ్నాన్స్ తిర్కీ, లాజరస్ బార్లా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి హాకీ క్రీడాకారుల్లో బీరేంద్ర లక్ర, అమిత్ రోహిదాస్, డిప్సాన్ తిర్కీ మరియు నమితా తొప్పో జట్టులో ఉన్నారు.

Related Posts