YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మరో వివాదంలో వర్మ

మరో వివాదంలో వర్మ

వివాదాల రామ్ గోపాల్ వర్మ ‘వెన్నుపోటు’ సాంగ్‌తో మరోసారి రచ్చ చేస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ‘దగా.. కుట్ర’ పాటను వర్మ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ‘వెన్నుపోటు’ పాట విషయమై టీడీపీ నేతలు, వర్మ మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. ఇప్పటికే ఈ పాటకు వ్యతిరేకంగా వర్మపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. సీఎం చంద్రబాబు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందంటూ హైకోర్టును ఆశ్రయించేందుకు సైతం టీడీపీ నేతలు వెనుకడుగు వేయడం లేదు.  వివాదాన్ని మరింత రాజేసి పబ్లిసిటీ రాబట్టుకోవడమే లక్ష్యంగా వర్మ అడుగులు వేస్తున్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి. మోహన్ రెడ్డికి ఆయన లీగల్ నోటీసులు పంపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ ద్వారా చంద్రబాబుకు పరువు నష్టం వాటిల్లేలా వర్మ వ్యవహరించారని ఆరోపిస్తూ.. కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 22న ఆ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. తనపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేకు ఎస్.ప్రభాకర్ అనే అడ్వొకేట్ ద్వారా వర్మ లీగల్ నోటీసులు పంపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్‌లో ఎవరినీ కించపరచలేదని చెప్పిన ఆర్జీవీ.. చంద్రబాబు పరువుకు నష్టం వాటిల్లితే.. కేసు పెట్టాల్సింది ఆయనేనని, ఎమ్మెల్యే కాదని ఆ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. తనపై పెట్టిన తప్పుడు కేసును 48 గంటల్లోగా ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వర్మ డిమాండ్‌కు అనుగుణంగా ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పకపోతే.. వివాదం మరింత ముదురుతుంది.

Related Posts