YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సమంత కొడుకుగా రావు రమేష్..!!

 సమంత  కొడుకుగా రావు రమేష్..!!

 సమంత.. 'అలా మొదలైంది' ఫేమ్ నందిని రెడ్డి కొరియాలో ఘన విజయం అందుకున్న ‘మిస్‌ గ్రానీ’ అనే చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు.. ఈ చిత్రానికి ‘ఓ బేబీ’, ‘ఎంత సక్కగున్నావే..’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్రంలో  సమంత 70 ఏళ్ల వృద్ధురాలిగా, 20 ఏళ్ళ యువతీ పాత్రలలో కనిపిస్తుంది. ఓ 70 ఏళ్ల వృద్ధురాలు ఫొటో తీయించుకునేందుకు ఓ స్టూడియోకి వెళుతుంది. అక్కడ ఫొటో తీయించుకుని బయటకు వచ్చాక అచ్చం తన పోలికలతో ఉన్న 20 ఏళ్ల యువతి కనిపిస్తుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయన్నదే కథ. ఈ చిత్రంలో 70 ఏళ్ల వృద్ధురాలి పాత్ర సమంతకి కుమారుడిగా రావు రమేశ్‌ నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

Related Posts