YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'ఎన్టీఆర్' చిత్రం పై కోర్టు కెక్కుతా

'ఎన్టీఆర్' చిత్రం పై కోర్టు కెక్కుతా
నవరస నటనా సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ చిత్రంపై వివాదం చెలరేగింది. తనను ఈ సినిమాలో విలన్‌గా చిత్రీకరిస్తే కోర్టును ఆశ్రయిస్తానని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. సినిమాలో తన పాత్రను ఎలా చిత్రీకరించారో తెలపాలని, తనను విలన్‌గా చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. దీనిపై ఇప్పటికే ఈ చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, సెన్సార్ బోర్డుకు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం తీసే సినిమాలో తనను ప్రతినాయకుడిగా చూపిస్తే సినిమా విడుదలను అడ్డుకుంటానని నాదెండ్ల భాస్కరరావు హెచ్చరించారు. ‘ఎన్టీఆర్’ సినిమాలో తన పాత్రను తప్పుగా చిత్రీకరించినట్లు ఓ వ్యక్తి ద్వారా తెలిసిందని, ఈ విషయం నచ్చకే మొదటి దర్శకుడు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీని బెజవాడ పాపిరెడ్డి సహా 20 మందితో కలిసి తానే స్థాపించానని, ఇదే విషయాన్ని ఎన్టీఆర్ గతంలో ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పారని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ను గద్దె దించిన ఘటనకు సంబంధించి నిజానిజాలు తెలుసుకోవాలంటే తాను రాసిన పుస్తకం చదవాలని సూచించారు. సినిమాలో నిజాలు వెల్లడిస్తే ఫర్వాలేదని.. కానీ నిజాలను వక్రీకరిస్తే మాత్రం న్యాయపోరాటం చేస్తానని నాదెండ్ల భాస్కరరావు హెచ్చరించారు. 

Related Posts