YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

‘గౌతమిపుత్ర..’ను దాటేసిన ‘యన్‌టిఆర్‌’..!!

 ‘గౌతమిపుత్ర..’ను దాటేసిన ‘యన్‌టిఆర్‌’..!!

బాలకృష్ణ  కథానాయకుడిగా 'ఎన్టీఆర్' బయోపిక్ భారీ అంచనాలు మధ్య ఈ రోజు జనాలు మధ్యకి వచ్చింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. కాగా.. అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమా ప్రీమియర్‌ షోను మంగళవారం ప్రదర్శించారు. నిన్నటి నుంచి ఈరోజు ఉదయం వరకు వేసిన షోలతో ‘యన్‌టిఆర్‌’ చిత్రం 4,40,000 డాలర్లు (రూ. 3,09,87,000) రాబట్టినట్లు సినీ విశ్లేషకులు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. బాలయ్య నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రీమియర్‌ షో వసూళ్లను ‘యన్‌టిఆర్‌’ చిత్రం బీట్‌ చేసిందని అంటున్నారు. అమెరికాలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రీమియర్‌ షో ద్వారా తొలి రోజు 3,75,000 డాలర్లు (రూ.2, 64,14,812) వసూళ్లు రాబట్టింది.

Related Posts