YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'కాంచన 3' ఫస్టులుక్ వచ్చేసింది..!!

'కాంచన 3' ఫస్టులుక్ వచ్చేసింది..!!

 కొరియోగ్రాఫర్, దర్శకుడు లారెన్స్ దర్శకత్వం వహించిన కాంచన సిరీస్ నుంచి మరో చిత్రం వచ్చేస్తుంది. దర్శక నిర్మాతగా కొంత గ్యాప్ తీసుకున్న ఆయన 'కాంచన 3'ని రూపొందించాడు. వేదిక .. నిక్కీ తంబోలి .. ఓవియా ఈ సినిమాలో కథానాయికలుగా కనిపించనున్నారు. లారెన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా తాజాగా షూటింగును పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. రుద్రాక్షలు ధరించిన మధ్య వయస్కుడిగా .. స్టైల్ గా .. లారెన్స్ కాలుపై కాలు వేసుకుని కూర్చున్న ఈ పోస్టర్, ఆయన అభిమానులను ఆకట్టుకునేదిగా వుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18వ తేదీన విడుదల చేయనున్నారు.
 

Related Posts