YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం వెల్దుర్తి జన్మభూమి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం వెల్దుర్తి జన్మభూమి కార్యక్రమంలో ఉప  ముఖ్యమంత్రి
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ద్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,  రెవిన్యూ శాఖా మంత్రి కే.ఈ కృష్ణమూర్తి అన్నారు.  శుక్రవారం వెల్దుర్తి మండలం గోవర్దనగిరి గ్రామంలో జరిగిన ఆరవ విడత జన్మభూమి - మావూరు ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  వాడ వాడల చంద్రన్న బాట పథకం కింద రూ.34 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. అలాగే కొత్తూరు కల్లం నుండి  ఎం.పి.ఈ స్కూల్ వరకు రూ.15 లక్షల అంచనాతో  నిర్మించనున్న అంతర్గత రోడ్లు, సిమెంట్ కాల్వల నిర్మాణానికి  శంఖుస్థాపన చేశారు.  రైతులకు 18 పెద్ద ట్రాక్టర్లు, 5 చిన్న ట్రాక్టర్లు మొత్తం 23 ట్రాక్టర్లను సబ్సిడీ ధరపై పంపిణీ చేసారు.  ఎన్. టి.ఆర్ గృహ నిర్మాణపథకం ద్వారా నిర్మించిన ఇంటిని ప్రారంభించారు.  అనంతరం  ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ  రాష్ట్రాన్ని విభజించిన తరువాత ఆర్థిక లోటు ఉన్న నవ్యాంధ్ర ప్రదేశ్ ను ముఖ్యమంత్రి అభివృద్ధిలో పరుగులు తీయిస్తున్నారన్నారు.  నిరుపేదలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు.  ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి ఎన్. టి.ఆర్ కె దక్కిందన్నారు. మరుగు దొడ్లను వినియోగించుకోవాలన్నారు.  రూ.13 లక్షలతో అంగన్వాడీ భవనాలను నిర్మించామన్నారు.  పెద్ద కొడుకులా వితంతువులు, వికలాంగులు, వృద్దులకు ప్రతి నెల రూ.1000లు పెన్షన్ ఇస్తున్నామన్నారు.  నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిని అందించడమే కాక శిక్షణను ఇప్పించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. హంద్రీ నీవా నీటిని 68 చెరువులకు తప్పక అందిస్తామన్నారు.  పెద్ద పెద్ద జబ్బులు వస్తే పేదలకు సి. ఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లక్షలు రూపాయలు అందించి ఆరోగ్యాన్ని బాగు చేస్తున్నామన్నారు.  ఒక్క మాటలో చెప్పాలంటే   ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గర్భం దాల్చినప్పటినుంచి మహాప్రస్థానం వరకు ప్రతి ఇంట్లో ఎదో ఒక పథకం ద్వారా లబ్దిని అందిస్తున్నామన్నారు.  చుక్కల భూములపై అనుభవంలో ఉన్న రైతులకు పూర్తి హక్కులను కల్పించాలని సుమోటోగా ప్రభుత్వం భావించి వారికి హక్కులను కల్పిస్తున్నామన్నారు.  
జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ  పైపు లైన్ ద్వారా తాగునీటి సౌకర్యాన్న కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.   2024 నాటికి గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై  గ్రామ అభివృద్ధి ప్రణాళిను ఆవిష్కరించారు.   ఒక రేషన్ కార్డులో అర్హులైన వారికి ఒక పెన్షన్ మాత్రమే వస్తుంది. అయితే ఆ ఇంట్లో బుద్ధిమాంద్యం పిల్లలున్నవారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వారికీ పెన్షన్ల్ ఇస్తామన్నారు. అర్హులై ఉండి రేషన్ కార్డులు లేనివారు, పింఛన్లు రానివారు, ఇళ్లు లేనివారుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.  మీ సమస్యలను పారదర్శకంగా పరిష్కరించుకెందుకు 1100 ఫోన్ చేసి చెప్పవచ్చు నన్నారు.  మీ భూమి పోర్టల్ ద్వారా మీ భూమి వివరాలను తెలుసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు.  మెరుగైన జీవితాన్ని ప్రజలందరికీ అందించాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమన్నారు. చంద్రన్న భీమా కింద రూ.15 లు చెల్లించి సభ్యత్వం తీసుకుని ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తున్నామన్నారు. 1954 ముందు చుక్కల భూములున్నవారికి అర్హతల మేరకు వారికి సంపూర్ణ హక్కులను కల్పిస్తున్నామన్నారు.  కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్, డిజిటల్ తరగతుల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. మీకు ఎన్ని కష్టాలున్నప్పటికి మీ పిల్లలను బాగా చదివించుకోవలని కలెక్టర్ కోరారు.
2022 నాటికి దేశంలో అత్యుత్తమ మూడు రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలోనే అత్యుత్తమైన రాష్ట్రంగా , 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలబెట్టాలన్న ఆశయంతో పనిచేయలన్నదే ముఖ్యమంత్రి విజన్ అన్నారు. జన్మభూమి చివరి రోజు అంశమైన  సుపరిపాలన ,ఇ -ప్రగతి, శాంతి భద్రతలపై అవగాహన కల్పించారు.  40 స్వయం సహాయక సంఘాలకు రూ.1.42 కోట్ల విలువైన మెగా  చెక్కును అందించారు.  నూతనంగా మంజూరైన లబ్దిదారులకు పెన్షన్ అందించారు.  పరిష్కరించిన చుక్కల భూముల పత్రాలను అందించి, గర్భిణీలకు సీమంతాలు చేశారు.  బాల్యవివాహాలు వద్దు అనే అవగాహన కల్పించే పాస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  హౌసింగ్ పి.డి.వెంకటేశ్వర రెడ్డి, మార్కెటింగ్ ఏ.డి సత్యనారాయణ చౌదరి,  గ్రామీణ నీటి సరఫరా  శాఖ ఎస్.ఈ హరిబాబు, ఎంపిడివో, మండల శాఖాధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts