YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సత్తెనపల్లిలో సంక్రాంతి వేడుకలు

సత్తెనపల్లిలో సంక్రాంతి వేడుకలు
స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని 8, 9, 10 తరగతి విద్యార్థులకు వక్తృత్వం మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. సత్తెనపల్లి సరస్వతి శిశు మందిరంలో నిర్వహించిన పైనల్స్ లో  ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పాల్గోన్నారు. కోడెల మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా మీలో ఉన్న తెలివి చోరవ బయటకు తీయడానికి ఒక ప్రయత్నం చేశాం. డాక్టర్ కోడెల సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలో అన్ని పాఠశాలలో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇది మన సత్తెనపల్లి అభివృద్ధి గురించి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మనం సాధించిన విజయాలు, చేసుకున్న అభివృద్ధి గురించి పోటీలు పెట్టడం జరిగింది. నాకు చదువు, చదుకునే విద్యార్థులు అంటే చాలా ఇష్టం. మన దేశంలో, రాష్ట్రంలో నూటికి 76శాతం మంది చదువుకున్న వారు ఉన్నారని అన్నారు. భవిష్యత్ లో యువత   నూటికి నూరు శాతం చదువుకోవాలి. ఒకప్పుడు బాగా వెనుబడిన సత్తెనపల్లి నియోజకవర్గం గురించి గతంలో ఎవ్వరూ పట్టించు కోలేదూ. ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సత్తెనపల్లి చూస్తే అర్థం అవుతుంది. లోటు బడ్జెట్ లో సైతం సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షితతో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్నాం. మీరు ఒక్క రోజు వేసిన ఓటుకి 18వందల రోజులు పనిచేసే నాయకులను ఎన్నుకోవాలి. ఈ ప్రభుత్వానికి మరో అవకాశం ఇస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాదాన్యత ఇస్తుంది. పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్, సైకిళ్ళు, భోజనాలు, పాఠశాలల అభివృద్ధి ఇలా ఎంతో చేస్తున్నాం. సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజకీయం, ఓట్లతో సంబంధం లేకుండా సత్తెనపల్లి అభివృద్ధి చేయడం జరిగింది. ఓట్లతో సంబంధం లేకుండా అభివృద్ధే ప్రధాన ద్యేయంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. విద్యార్థులు దైర్యంగా మాట్లాడే చోరవ రావాలని సూచించారు. విద్యార్థులు కృషితో, పట్టుదలతో ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చు. విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు ఈ దేశానికి సంపద  అని కోడెల అన్నారు. పోటీల్లో  పాల్గొన్న 220 మంది విద్యార్థులకుడాక్టర్ కోడెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  సైకిళ్ళు, స్కూల్ బ్యాగ్స్, లంచ్ బాక్స్ లు అందించారు.

Related Posts