YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాజకీయ ప్రయోజనాల కోసం రిజర్వేషన్ల సిద్దాంతానికి తూట్లు

రాజకీయ ప్రయోజనాల కోసం రిజర్వేషన్ల సిద్దాంతానికి తూట్లు
అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు పెడుతూ లోక్ సభ, రాజ్యసభ ఒకే రోజులో బిల్లు ఆమోదించడం పట్ల పలు బి.సి కుల సంఘాల రాష్ట్ర నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు.శుక్రవారం  హైదరాబాద్ లోని బషీర్ బగ్ ప్రెస్ క్లబ్ లో ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన బి.సి కుల సంఘాల సమావేశం కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించిoది. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన రిజర్వేషన్ల సిద్దాంతానికి తూట్లు పోడుస్తారాయని ప్రశ్నించారు. అగ్రకులాలకు రిజర్వేషన్లు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. బి.సి లకు 54 శాతం ఉంటె 27 శాతం రిజర్వేషన్లు ఇస్తూ అన్యాయం చేస్తున్నారు. పైగా బి.సిలు చట్ట సభలలో రిజర్వేషన్లు కావాలని, అలాగే ఎస్సి,ఎస్టి,బిసి లకు ప్రైవేటు రంగంలో, ఉన్నత న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు కావాలని పోరాడుతుంటే పట్టించుకోవడం లేదు. కాని అగ్రకులాలకు అడుగకుండానే రిజర్వేషన్లు పెడుతూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు.

Related Posts