YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పండగ బాదుడు

పండగ బాదుడు
సంక్రాంతి.. తెలుగువారికి ప్రత్యేకం. ప్రధానంగా సీమాంధ్రులు బంధుమిత్రులతో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అందుకే సంక్రాంతికి ఎక్కడున్నా  స్వస్థలాల్లో వాలిపోతారు. ఈ నేపథ్యంలోనే పండుగ జోష్ ను ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్.  చార్జీలను అమాంతంగా పెంచేశాయి. కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు చెప్తున్న టికెట్ ధరలకు ప్రయాణికుల మతులు పోతున్నాయి. ఫ్లైట్ చార్జీలను తలపిస్తున్నాయని పలువురు వాపోతున్నారంటే... ప్రైవేట్ ట్రావెల్స్ ఏ రేంజ్ లో దండుకుంటున్నాయో ఈజీగానే అర్ధం చేసుకోవచ్చు. డిమాండ్ దృష్ట్యా ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు టికెట్ ధరలను ఒక్కసారిగా పెంచేశాయి. ఎలాగైనా సొంత ఊళ్లకు వెళ్లాలనుకునేవారు అధికమవడంతో ఏజెన్సీలకు కలిసివస్తోంది. కొన్ని బస్సుల్లో సీట్లు నిండిపోయినా అదనంగా ప్లాస్టిక్ కుర్చీలు, స్టూల్స్ వేస్తున్నారు. వీటినీ సీట్లుగానే పరిగణిస్తూ ప్రయాణికుల నుంచి పెద్ద మొత్తంలోనే వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో వందల్లో ఉండే టికెట్ ధర.. వేలల్లోకి చేరిపోయింది. నలుగురున్న కుటుంబం దూరప్రాంతాల్లోని స్వస్థలాలకు వెళ్లాలంటే 8 నుంచి 10వేల రూపాయల వరకూ ఖర్చవుతోంది. ఈ లెక్క.. ప్రైవేట్ బస్ ల్లోని కాస్ట్లీ జర్నీకి నిదర్శనం.    
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా రవాణా శాఖ చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ ప్రయాణికులకు చార్జీల మోత తప్పడంలేదు. మొత్తంగా సంక్రాంతి పండుగ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. టిక్కెట్ల రేట్లను అమాంతం పెంచేసి ప్రయాణీకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. సంక్రాంతికి హైదరాబాద్‌ నుంచి వెళ్లే వారు ఈనెల 12, 13, 14 తేదీల్లో ఎక్కువగా ప్రయాణమవుతుంటారు. తిరిగి 16, 17, 18 తేదీల్లో నగరానికి తిరిగి వస్తుంటారు. ఈ తేదీల్లోనే బస్సుల టికెట్ల ధరలను రెట్టింపు, అంతకంటే ఎక్కువ పెంచేసి విక్రయిస్తున్నారు. ఈ ఆరు రోజుల్లో ఉన్న డిమాండును సొమ్ము చేసుకునేందుకు పగలూ రాత్రీ ప్రైవేటు బస్సులను నడుపుతున్నారు. సంక్రాంతి పండుగ అంటే చాలు హైదరాబాద్‌ ఒక్కసారిగా ఖాళీ అయిపోతుంది. మూడు రోజుల పాటు సాగే పెద్ద పండుగకు తెలుగు రాష్ట్రాల్లో సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఏడాది అంతా పడిన శ్రమను మర్చిపోయేందుకు అన్నట్లు లక్షలాది మంది పల్లె బాట పడతారు. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్‌ దోపిడీకి తెర తీశాయి. పండుగ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ఆర్టీసీలు ప్రస్తుత టికెట్‌ ధరపై 50 శాతం అదనంగా వసూలు చేస్తుంటే, ప్రైవేటు ట్రావెల్స్‌కు మాత్రం అడ్డూ అదుపు లేదు. ఎవరికి తోచినట్లు వారు చార్జీలు పెంచుకుని సంక్రాంతి డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.

Related Posts