YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

సఫారీలను కుమ్మేసిన టీమిండియా

Highlights

  • తొలి టీ 20 సిరీస్‌లో అదరగొట్టిన  టీమిండియా
  • .బౌలింగ్‌లో కూడా రాణింపు 
  • చెలరేగిన  భువనేశ్వర్‌ కుమార్‌
  • 28 పరుగుల తేడాతో టీమిండియా శుభారంభం
  • 48 పరుగులకే మూడు కీలక వికెట్లను నష్టపోయిన దక్షిణాఫ్రికా
సఫారీలను కుమ్మేసిన టీమిండియా

 దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ 20 సిరీస్‌లో టీమిండియా అదరగొట్టింది. తొలుత సఫారీలను కుమ్మేసిన టీమిండియా.. అటు బౌలింగ్‌లో కూడా రాణించి అద్బుతమైన విజయాన్ని అందుకుంది. భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఐదు వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 28 పరుగుల తేడాతో టీమిండియా శుభారంభం చేసింది. భారత్‌ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సఫారీలు 29 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయారు. ఓపెనర్‌ స్మట్స్‌(14) మొదటి వికెట్‌గా అవుటయ్యాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ జేపీ డుమినీ(3), డేవిడ్‌ మిల్లర్‌(9) కూడా నిరాశపరచడంతో దక్షిణాఫ్రికా 48 పరుగులకే మూడు కీలక వికెట్లను నష్టపోయింది.

అయితే హెండ్రిక్స్‌, బెహర్దియన్‌ జంట సఫారీ ఇన్నింగ్స్‌ను మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి 81 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత బెహర్దియన్‌(39) నాల్గో వికెట్‌గా అవుటయ్యాడు. కాగా, హెండ్రిక్స్‌ మాత్రం కాసేపు భారత బౌలర్లను భయపెట్టే యత్నం చేశాడు. వరుసగా బౌండరీలు సాధిస్తూ సఫారీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జట్టు స్కోరు 154 పరుగుల హెండ్రిక్స్‌(70) ఐదో వికెట్‌గా నిష్క్రమించడంతో సఫారీ దిశగా పయనించింది.. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లలో క్లాసెన్‌(16), మోరిస్‌(0), డాన్‌ ప్యాటర్సన్‌(1)లు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో సఫారీలకు ఘోర పరాజయం  ఎదురైంది. భువీకి జతగా ఉనాద్కత్‌, హార్దిక్‌ పాండ్యా, చాహల్‌లు తలో వికెట్‌ సాధించారు. మూడు ట్వంటీ 20 ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శిఖర్‌ ధావన్‌(72;39 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీకి తోడు రోహిత్‌ శర్మ(21;9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి(26;20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) సమయోచితంగా ఆడటంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఇది ట్వంటీ 20ల్లో దక్షిణాఫ్రికాపై భారత్‌ అత్యధిక స్కోరు. టీమిండియా ఇన్నింగ్స్‌ను శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మలు ధాటిగా ఆరంభించారు.ప్రధానంగా రోహిత్‌ శర్మ తొలి ఓవర్‌లోనే విరుచుకుపడ్డాడు. ప్యాటర్సన్‌ వేసిన మొదటి ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఫోర్‌ సాయంతో రోహిత్‌ విజృంభించి ఆడాడు. దాంతో తొలి ఓవర్‌లోనే భారత్‌ 18 పరుగుల్ని పిండుకుంది.

అదే ఊపును రెండో ఓవర్‌లో కూడా కొనసాగించే క్రమంలో రోహిత్‌ అవుటయ్యాడు. డాలా వేసిన రెండో ఓవర్‌ ఐదో బంతికి కీపర్‌ క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.అటు తర్వాత చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన సురేశ్‌ రైనా తన సత్తాచాటుకునే క‍్రమంలో రెండో వికెట్‌గా అవుటయ్యాడు. ఏడు బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 15 పరుగులు చేసి పెవిలియన్‌ బాట పట్టాడు. డాలా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత‍్నించి బౌలర్‌కే క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. ఆ సమయంలో ధావన్‌కు జత కలిసిన కెప్టెన్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టే యత్నం చేశాడు.అయితే షమ్సి బౌలింగ్‌లో ఎల్బీగా మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో భారత జట్టు 108 పరుగుల వద్ద కోహ్లి వికెట్‌ను నష్టపోయింది. కాగా, ధావన్‌ మాత్రం నిలకడగా ఆడుతూ 27 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఫెహ్లకోహియో వేసిన ఇన‍్నింగ్స్‌ 15 ఓవర్‌లో ధావన్‌ నాల్గో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ ఓవర్‌ నాల్గో బంతిని వికెట్ల వెనక్కిహిట్‌ చేయబోయి కీపర్‌కు సునాయస క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఇక ధోని(16) ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరడంతో చివర్లో మనీష్‌ పాండే(29 నాటౌట్‌), హార్దిక్‌ పాండ్యా(13 నాటౌట్‌)లు జట్టు స్కోరును రెండొందల దాటించారు.

Related Posts