YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

భట్టి పాదయాత్రకు రాహూల్ గ్రీన్ సిగ్నల్ 

Highlights

  • ఉడుంపట్టుపట్టిన "భట్టి" 
  • భట్టి పాదయాత్ర మాకోసారి తెరపైకి 
  • టీపీసీసీ  దూకుడు మొదలైంది
  • యువ నాయకత్వాన్ని ప్రోత్సహం..
  • పాదయాత్రకు విక్రమార్క సన్నాహాలు
భట్టి పాదయాత్రకు రాహూల్ గ్రీన్ సిగ్నల్ 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ అధిష్టానం నేతలకు సూచన ప్రాయ అంగీకారం తెల్పింది. దింతో పార్టీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపద్యంలో టీపీసీసీ  దూకుడు మొదలైంది. తెలంగాణ ను ప్రకటించి దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రజలకు స్వరాష్ట్ర పాలన ను అందించిన కాంగ్రెస్, గత నాలుగేళ్ళుగా అధికారానికి దూరమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సాదనే ధ్యేయంగా ఉద్యమ పార్టీగా అవతరించి, 2014 లో తెలంగాణ అవిర్భావం తరువాత పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారిన టిఆరెస్ తన ఎత్తులతో కాంగ్రెస్ ను ఆత్మరక్షణలో పడేసింది.దాదాపు తెలంగాణ ఆవిర్భావం ఒక్కటే కాంగ్రెస్ కు విజయమైనా, ఆ తరువాత అన్నీ అపజయాలను ముఠా కట్టుకుంది.

సమన్వయం లోపించి..

నారాయణఖేడ్ ఉప ఎన్నిక నుండి పాలేరు బైఎలక్షన్ వరకు, నిన్న మొన్నటి జక్కేపల్లి ప్రాదేశిక నియోజక వర్గ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ "రేసు"లో చతికల పడిందనే చెప్పాలి. అయితే జరిగిన ఈ ఎన్నికలన్ని కాంగ్రెస్ కు బలంలేక కాకుండా, ఉన్న ఓట్లను సమన్వయం లోపించి నాయకత్వం లేక కోల్పోయినవే. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర  కార్యనిర్వాహక అధ్యక్షులు, మధుర ఎమ్మెల్యె గా ఉన్న భట్టి విక్రమార్క మాత్రం ప్రతికూల పరిస్థితులలోనూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. ఈ విషయాన్ని కేసీఆర్ నిర్వహించిన సర్వే కూడా తేటతెల్లం చేసింది. తెరాస హవా నడుస్తున్న తెలంగాణలో సియం సర్వేలో సైతం కాంగ్రెస్ గెలుస్తాయనే సీట్లలో మధిర ప్రముఖంగా ఉండటం భట్టి విక్రమార్క శ్రమకు తార్కాణంగా పేర్కోనవచ్చు.విధ్యాధికుడైన భట్టి కాంగ్రేస్ నుండి ఏ కార్యక్రమం చేపట్టినా ఎంతో నిబద్దతతో పనిచేస్తారనే గుర్తింపు అధీనావర్గంలో ఉంది.

భట్టి కృషికి నిదర్శనం..
ముందుగా గ్రామాలలో కాంగ్రెస్ సానుభూతి పరులను కాంగ్రెస్ కార్యకలాపాలలో భాగస్వామ్యం చేసేందుకు గ్రామాలలో వివిధ కమిటీల పేరుతో ఒక్కో పంచాయితీ నుండి వంద నుండి రెండొందల మందిని కార్యకర్తలతో చిన్న సైజు సైన్యంగా  తయారు చేశారు  ఈ విధంగా  ఏర్పాటు చేసిన కమిటిలలో సుమారు 5వేల మంది పార్టీ కార్యకర్తలను సుశిక్షుతులుగా  తయారు చేయడం అయన ఎలోచన పేరునేటికి నిదర్శనం. ఈ కమిటీలను రాష్ట్ర, కేంద్ర సాంప్రదాయాల రీతిలో మండల వారీ ప్లీనరీలు ఏర్పాటు చేసి మరీ ఎప్పటికప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలను,  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలోకి తీసుకెళ్ళే  విధానంలో 'విక్రమార్కుడు' కృతకృత్యులయ్యారు అంతే కాకుండా తాను చేసిన ఈ విధానాన్ని, తన నియోజకవర్గంలో కార్యకర్తల పటిష్టతను  రాష్ట్ర, కేంద్ర నాయకులకు రోల్ మోడల్ గా   పరిచయం చేయటమే కాకుండా, ఈ విధానాన్ని  రాష్ట్రంలో ఫాలో అయ్యేట్టు చేసి మరింత మెరుగైన ఫాలోయింగ్ పెంచుకున్నారు.దీంతో తెలంగాణ వ్యాప్తంగా పార్టీని మరింత పటిష్ట పరచాలనే ఉద్దేశ్యంతో టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ తో కలిసి పాదయాత్రకు కు సంకల్పించారు భట్టి విక్రమార్క.

అడుగడుగునా అడ్డంకులు..
అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ లో భట్టి విధానాలకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. దాదాపు ఇప్పటికే రెండుసార్లు కాంగ్రెస్ ముఠా రాజకీయాలే  భట్టీ సంకల్పానికి అడ్డుతగిలాయని రాజకీయ పరిశీలకుల వాదన.అయితే ఏఐసిసి లో వచ్చిన మార్పులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటి బాహుబలి గా రాహుల్ రాక  దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ కు జవసత్వాలు నింపిన తరుణంలో భట్టీ పాదయాత్ర మరోసారి ముందుకు వచ్చింది.
అయితే రెండుసార్లు తన అభిమతానికి సానుకూల పరిస్థితులు కానరానప్పటికీ  వెనక్కి పోయినా వెనుకాడని భట్టి, తన  అధిష్టాన్నాన్ని , రాష్ట్ర నాయకత్వం అదిసాల కోసం  సహనంతో వేచి చూశారు.


యువ నాయకత్వాన్ని ప్రోత్సహం..
యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే రాహుల్ అభిమతానికి  అణుగుణంగా, టీపీసీసీ కార్యక్రమాలకు రూపమిస్తున్న దశలో కాంగ్రెస్ సీనియర్లు, రాష్ట్ర అధినాయకత్వం తలపెట్టిన బస్సు యాత్ర తరువాత పాదయాత్ర ఉండే అవకాశముంది. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో రెండు నెలలలో బస్సు యాత్ర చేసి, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల వరకూ ప్రజల్లో ఉండేందుకు తెలంగాణ లో కొంత మంది యువనాయకత్వాన్కి పాదయాత్ర చేసేందుకు సూచన ప్రాయ అంగీకారం వచ్చినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలో భట్టి పాదయాత్రకు కూడా రాహూల్ రైట్ చెప్పారని శ్రేణుల్లో ఆనందం వ్యక్తమౌతుంది. 

Related Posts