YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

యువ క్రికెటర్ బలవన్మరణం

Highlights

  • జట్టులో చోటు దక్కలేదని మనస్తాపం
  • కుమారుడి మృతికి కోచ్ కారణం
  • పాక్ మాజీ క్రికెటర్ ఆరోపణ 
యువ క్రికెటర్ బలవన్మరణం

 జట్టులో  తనకు అవకాశం రాలేదని తీవ్ర మనస్తాపం చెందిన యువ క్రికెటర్ బలవన్మరణం చెందాడు. ఈ ఘటన పాకిస్తాన్‌లో జరిగింది. వివరాల్లోకెళ్తే.. ఆమిర్ హనీఫ్‌ పాకిస్తాన్ మాజీ క్రికెటర్. 1990 దశకంలో పాక్ వన్డే జట్టులో సభ్యుడిగా కొన్ని మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించాడు. అనంతరం క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. హనీఫ్ పెద్ద కుమారుడు మహమ్మద్‌ జర్యాబ్‌. ఇటీవల లాహోర్‌లో నిర్వహించిన ఓ టోర్నమెంట్‌లో కరాచీ అండర్‌-19 టీమ్‌ తరపున జర్యాబ్‌ కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. కానీ గాయం కారణంగా జర్యాబ్ టోర్నీ మధ్యలోనే ఇంటికి వెళ్లాడు. గాయం కోలుకున్నాక మళ్లీ ఛాన్స్ ఇస్తామని జర్యాబ్‌కు కోచ్, టీమ్ మేనేజ్ మెంట్ హామీ ఇచ్చింది. అయితే తాజాగా జరిగిన పాక్ అండర్-19 టీమ్ ఎంపికలో జర్యాబ్ ను పక్కనపెట్టారు.  జర్యాబ్‌ తీవ్ర మనస్తాపానికి లోనై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తండ్రి, మాజీ క్రికెటర్ ఆమిర్ హనీఫ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

Related Posts