YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మాదాపూర్ లేడీస్ హాస్టల్లో యువతి ఆత్మహత్య

మాదాపూర్ లేడీస్ హాస్టల్లో యువతి ఆత్మహత్య

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

నగరంలోని మాదాపూర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణోదయ కాలనీలోని ఓ హాస్టల్లో శ్రీవిద్య (25)సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఊపిరి అడకుండా మొహానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నెల 10న హాస్టల్లో శ్రీవిద్య చేరింది. రాత్రి నుండి తలుపు తియ్యకపోవడంతో అనుమానం వచ్చిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు

Related Posts