YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కింగ్ కు మోడీ రిక్వెస్ట్

కింగ్ కు మోడీ రిక్వెస్ట్

 యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

ట్విట్టర్‌ను వాడుకోవడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్టైలే వేరు. కేవలం ప్రభుత్వం చేపట్టే పథకాలు, ఆయన పర్యటనలు వంటి వాటికే కాకుండా ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాల ప్రచారానికి కూడా మోదీ ట్విట్టర్‌ను ఓ ఆయుధంలా వాడతారు. ఇలాంటి కార్యక్రమాల ప్రచారంలో దేశంలోని సెలబ్రిటీలను కూడా భాగం చేస్తుంటారు. గతంలో స్వచ్ఛభారత్‌కు సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పించడానికి ఇలానే సెలబ్రిటీల సాయం తీసుకున్నారు మోదీ. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను చైతన్యం చేసే పనిలో మోదీ పడ్డారు. ఈ కార్యక్రమంలోనూ సెలబ్రిటీలను మమేకం చేస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం సెలబ్రిటీలను ట్యాగ్ చేస్తూ మోదీ వరసపెట్టి ట్వీట్లు చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యం తీసుకురావాలని కోరారు. మోదీ రిక్వెస్ట్ చేసిన సెలబ్రిటీల్లో మన కింగ్ నాగార్జున కూడా ఉన్నారు. మోహన్ లాల్, అక్కినేని నాగార్జునను ట్యాగ్ చేసి మోదీ ఒక ట్వీట్ చేశారు. ‘డియర్ మోహన్ లాల్, నాగార్జున.. ఎన్నో ఏళ్లుగా మీ నటనతో మిలియన్ల కొద్ది ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. భారీ స్థాయిలో ఓటర్లలో అవగాహన కల్పించాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చైతన్యం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలా కేవలం మోహన్ లాల్, నాగార్జునకు మాత్రమే కాదు.. ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, బాలీవుడ్ నటీనటులు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, మీడియా పెద్దలు ఇలా అందరినీ మోదీ కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. ఆయా రంగాలకు చెందిన వ్యక్తులను ఓ పద్ధతి ప్రకారం ట్యాగ్ చేసి మరీ మోదీ ట్వీట్లు చేశారు. క్రీడల నుంచి విరాట్ కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ, కిదాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లను ట్యాగ్ చేసి ట్వీట్లు చేశారు. బాలీవుడ్ నుంచి రణ్‌వీర్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్, దీపికా పదుకొనె, అలియా భట్, అనుష్క శర్మలను మోదీ రిక్వెస్ట్ చేశారు

Related Posts