YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

2020 జూలై 30న ఆర్ఆర్ఆర్

2020 జూలై 30న ఆర్ఆర్ఆర్
యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
ఎట్టకేలకు దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. బాహుబలి చిత్రంతో ప్రపంచ స్థాయి గుర్తింపుపొందిన రాజమౌళి.. టాలీవుడ్ అగ్రహీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్లతో ‘ఆర్ ఆర్ ఆర్ ’ మూవీ అనౌన్స్ చేయగానే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. మరోసారి పాన్ ఇండియా మూవీని రూపొందిస్తున్నట్టు ప్రకటించిన రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్లను ఎలా చూపించబోతున్నారు? ఈ చిత్రంలో నటించే హీరోయిన్లు ఎవరు? అసలు ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయబోతున్నారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వీటన్నింటిపై ప్రేక్షకుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ గురువారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు రాజమౌళి. ఇందులో రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తేదీని ప్రకటించారు. 2020 జూలై 30న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు రాజమౌళి. అయితే సంవత్సరాల తరబడి ఒకే సినిమాను తీసే రాజమౌళి విడుదల తేదీపై మాత్రం చాలా పక్కాగా వ్యవహరిస్తారు. అందులోనూ సెంటిమెంట్ను కూడా ఫాలో అవుతారు. తాజాగా ‘ఆర్ ఆర్ ఆర్ ’ సినిమా విషయంలోనూ అదే సెంటిమెంట్ను ఫాలో అయ్యారు. రాజమౌళికి జూలై సెంటిమెంట్ ఉంది. ఆయన తీసిన చిత్రాల్లో సగానికి సగం జూలై నెలలోనే విడుదల చేస్తుంటారు. ఆయన 12 చిత్రాల్లోనూ 6 చిత్రాలు జూలై నెలలోనే విడుదలయ్యాయి. బాహుబలి ది బిగినింగ్ జూలై 10న విడుదల కాగా.. ఈగ జూలై 6, మర్యాద రామన్న జూలై 22, మగధీర జూలై 31, సింహాద్రి జూలై 9న విడుదల చేశారు. తాజాగా ప్రతిష్ఠాత్మక ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా కూడా జూలై నెలలో 30 విడుదల చేస్తున్నారు. సింహాద్రి మొదలు.. మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి ఇలా జూలైలో విడుదలైన రాజమౌళి ప్రతి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సో.. ఆర్ ఆర్ ఆర్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే ధీమాతో జూలై సెంటిమెంట్ను ఫాలో అయ్యారు రాజమౌళి. 

Related Posts