YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

మేధస్సు.. శక్తికి సంకేతం..గజముఖం

మేధస్సు.. శక్తికి సంకేతం..గజముఖం

యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:

వినాయకుడు.. తొలిపూజలందుకునే దేవదేవుడు. గజముఖుడి ఆపాదమస్తకం ఓ అపూర్వమే.. మేధస్సు, శక్తి, సన్మార్గం, గాంభీర్యం, సున్నితత్వం, త్యాగం… ఆ రూపంలో అన్నీ గుణగణాలూ ఇమిడి ఉన్నాయి. గణేశుని కృపా కటాక్షం ఉంటే… తలపెట్టిన ఏ కార్యమైనా నిర్విఘ్నంగా సాగుతుందనేది భక్తుల నమ్మకం. గజముఖం. 

వినాయకుడు, గణేశుడు, విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు.. ఇలా ఎన్నో నామాలు.. గణాలకు అధిపతిగా, శబ్దాలకు రాజుగా, ప్రవణ స్వరూపుడై శబ్ద బ్రహ్మగా పిలవబడుతున్నాడు. గ అనే శబ్దం బుద్ధికి.. ణ అనే శబ్దం జ్ఞానానికి ప్రతీక. ఎంతటి కార్యమైనా తొలి పూజ అందుకునేది విఘ్ననాదుడే.. మొదట మనం స్మరించేది కూడా ఆయన్నే. సర్వ విద్యలకు మూలం.. సకలవేదాల సారం గణపయ్య.. ఉపనిషత్తుల అంతరార్థం.. సర్వ పురాణాల సంక్షిప్త రూపం కూడా. ఏనుగు తల నుంచి ఎలుక వాహనం వరకూ రూపమంతా ప్రతీకాత్మకమే. పెద్ద తల గొప్పగా ఆలోచించమని చెబుతుంది. చిన్న కళ్లు చూపు లక్ష్యం వైపే ఉండాలన్న సత్యాన్ని చూపిస్తాయి.

గణేశుని కృపా కటాక్షం ఉంటే తలపెట్టిన ఏ కార్యమైనా నిర్విఘ్నంగా సాగుతుందని నమ్మకం.. సకల విఘ్నరాజైన పార్వతీ తనయుడి రూప విశేషాలు చాలా విలక్షణమైనవి. మిగిలిన దేవతల్లా గాక వినాయక ప్రతిమలు వైవిధ్యంతో కనిపిస్తాయి. నిల్చున్నట్టు, కూర్చున్నట్టు, నృత్యం చేస్తున్నట్టు, రాక్షసులను సంహరిస్తున్నట్టు, ఆడుకుంటున్నట్లు.. ఇలా ఎన్నో రకాలుగా ఉండటం పురాతన కాలం నుంచి కనిపిస్తోంది.

Related Posts