YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిజామాబాద్ ఎంపీ టిక్కెట్ కవితకు కేటాయించడం పట్ల హర్షం

 నిజామాబాద్ ఎంపీ టిక్కెట్ కవితకు కేటాయించడం పట్ల హర్షం
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా టీఆర్ఎస్ పార్టీ రెండవ సారిగా టికెట్ కల్వకుంట్ల కవిత ను కేటాయిచడం పట్ల జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా జగిత్యాల పట్టణంలో టీఆర్ఎస్  జిల్లా మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి,టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఆనంతరం మైనారిటీ నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీగా మళ్లీ కవిత ను భారీ మెజారిటీ తో గెలిపించి పార్లమెంట్ కు పంపిస్తామన్నారు.ఈకార్యక్రమం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అమీనుల్ హసన్ ,రియాజ్ ఖాన్ ,అఫ్జల్ బేగ్ ,మోసిన్ ,కౌన్సిలర్ బారీ ,ఖాదీర్ ,జావీద్ ,ఖలీం ,సూఫీ పుర్జాన్ ,జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
కోరుట్ల టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు
టీఆర్ఎస్ పార్టీ తరుపున నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత ప్రకటించడం పై స్ధానిక మున్సిపల్ చైర్మన్ గడ్డమీది పవన్ ,టీఆర్ఎస్ పట్టణాధ్యాక్షుడు ఆన్నం ఆనీల్ హర్షం వ్యక్తం చేస్తు ,ఎంపీ కవిత ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా పట్టణంలోని ప్రధాన కూడలిలో వద్ద కార్యకర్తలతో కలసి బాణాసంచా కాల్చి ,మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.ఆనంతరం వారు మాట్లాడుతూ రెండుసారి ఎంపీ కవితను తెలంగాణ లోనే అత్యంత మెజారిటీ తో గెలిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ కవిత గెలుపు కోరు ప్రతి కార్యకర్తలు సైనికుడిగా పని చేయాలని సూచించారు. ఈకార్యక్రమం కౌన్సిలర్లు యాటం కరుణాకర్, బట్టు సునీల్, వహబ్ ,నాయకులు ఆడెపు మధు ,జక్కుల జగదీశ్వర్, కస్తూరి లక్ష్మీ నారాయణ, గుండోజి శ్రీనివాస్, సదుబత్తుల వేణు ,ఎస్ డి .ఫాయిం, ముబీన్ పాష ,చింతామణి ప్రభాకర్, యూత్ అధ్యక్షుడు సనావోద్దిన్ ,జాల వినోద్, సృజన్ ,తదితరులు పాల్గొన్నారు.

Related Posts