YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లను పెంచడానికి కృషి: మంత్రి ఎర్రబెల్లి

రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లను పెంచడానికి కృషి: మంత్రి ఎర్రబెల్లి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

బీసీ రిజర్వేషన్లను  యథాతథంగా 34% కు పునరుద్ధరించడానికి ముఖ్యమంత్రి కె.సి.ఆర్ సుముఖంగా ఉన్నారని, సుప్రీంకోర్టు తగ్గించాలని తీర్పు చెప్పిన అందువలనే తప్పని పరిస్థితులలో తగ్గించాల్సి వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పేర్కొన్నారు.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ నాయకత్వంలో కొత్తగా ఏర్పడిన  కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లను పెంచడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీ/ఎం.పీ.టీ.సీ/ జడ్.పి.టి.సి ఎన్నికలలో బి.సి రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 తగ్గిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ రిజర్వేషన్లను పెంచడానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో శుక్రవారం మంత్రి నివాసంలో చర్చలు జరిపారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లును 34 శాతం నుంచి 22 శాతం కు తగ్గించి ఎన్నికలు జరిపారు. దీని మూలంగా రాష్ట్రంలో 1600 సర్పంచ్ పదవులు 20 వేల వార్డు మెంబర్లు బి.సిలకు దక్కకుండ పోయాయి. రాష్ట్రంలో బీసీలు సమగ్ర సర్వే ప్రకారం  52 శాతం ఉంటే 34 శాతం రిజర్వేషన్లు ఉన్నవి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 22 శాతం తగ్గించారు. దీనితో బీసీ కులాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. కనీసం ఇప్పుడు ఎంపిటిసి,జెడ్పిటిసి ఎన్నికలలో 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరుపాలని విజ్ఞప్తి చేశారు.

Related Posts