YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

లక్ష్మీస్ ఎన్టీఆర్ కు సినిమా కష్టాలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ కు సినిమా కష్టాలు
 యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని విడుదల కష్టాలు వీడటం లేదు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 29న విడుదల చేస్తానని రామ్ గోపాల్ వర్మ ధీమాగా చెబుతున్నారు. అయితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ భవితవ్యం ఇంకా సెన్సార్ చేతిలోనే ఉంది. 29న విడుదల కావాల్సిన ఈ మూవీకి సెన్సార్ క్లియరెన్స్ రాలేదు. విడుదలకు మరో మూడు రోజులు సమయం ఉన్నందున ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎలక్షన్ తరువాత వచ్చే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాగా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని తెలుగు తమ్ముల్లు చేస్తున్న ప్రయత్నాలకు సఫలీకృతం అవుతున్నాయి. మార్చి 22న విడుదల కావాల్సిన ఈ మూవీకి సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో చేసేది లేక 29కి వాయిదా వేశారు. ఇప్పుడు కూడా బాల్ సెన్సార్ కోర్టు‌లోనే ఉండంటంతో అభ్యంతరాలు చెప్పడానికి కారణాలు వెతుక్కునే పనిలేదు. ఎలాగూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పూర్తి రాజకీయ పరమైన చిత్రం కావడం.. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేక పవనాలు వీచే సన్నివేశాలు ఉండటం.. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండటం.. ఓటర్లను ప్రభావింతం చేసేందుకు వీటిలో ఏదో ఒకదాన్ని అభ్యంతర కారణంగా చూపించొచ్చు. వాటికి దర్శక, నిర్మాతల నుండి వివరణ కోరినా.. వారి సమాధానాలతో సంతృప్తి చెందకపోవచ్చు. తద్వారా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎన్నికల ముందు విడుదల కావడం కష్టం అనే చెప్పాలి. వీటన్నింటినీ కాదని కోర్టుకు వెళ్లినా.. ఒకటి రెండు రోజుల్లో క్లియరెన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. దీంతో వర్మ ముందుగా ప్రకటించినట్టు ఒకవేళ తన సినిమాను సెన్సార్ అడ్డుకుంటే యూట్యూబ్‌లోనైనా విడుదల చేస్తానన్న మాటలు నిజమయ్యేటట్టు కనిపిస్తున్నాయి. ఇలా చేస్తే.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల చారిత్రాత్మకమే అవుతుంది. దీనికి తోడు ఈ చిత్రం ఓటర్లను ప్రభావితం చేస్తుందని అధికార టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో చిత్ర నిర్మాతకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈరోజు (సోమవారం) ఎన్నికల సంఘం ఎదుట వ్యక్తిగతంగా హాజరు అయ్యారు నిర్మాత రాకేష్ రెడ్డి. అభ్యంతరాలపై రాతపూర్వకమైన వివరణ ఇచ్చిన రాకేష్ రెడ్డి.. ఎట్టిపరిస్థితుల్లోనూ ముందుగా ప్రకటించిన మార్చి 29 నాడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని విడుదల చేస్తాం అంటున్నారు. అయితే నిర్మాత వివరణపై ఎలక్షన్ కమీషన్ ఎలా స్పందిస్తుంది.. సెన్సార్ నుండి క్లియరెన్స్ వస్తుందా? అన్నది ఉత్కంఠను కలిగిస్తుంది.ఈ సందర్భంలో వర్మ ముందుగా ప్రకటించినట్టు ఒకవేళ తన సినిమాను సెన్సార్ మళ్లీ అడ్డుకుంటే యూట్యూబ్‌లోనైనా విడుదల చేస్తానన్న మాటలు నిజమయ్యేటట్టు కనిపిస్తున్నాయి. ఇలా చేస్తే.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల చారిత్రాత్మకమే అవుతుంది. 

Related Posts